జూబ్లీహిల్స్ ప్రచారంలో సీఎం, క్యాబినెట్ మంత్రులు …
జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో గెలుపు కోసం కాంగ్రెస్ పార్టీ మంచి వ్యూహరచన చేసింది ..ఇక్కడ గెలవడం ద్వారా హైద్రాబాద్ మహానగరంలో సత్తాచాటాలని ఉన్న అన్ని అవకాశాలు వినియోగించుకుంటుంది …ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అన్ని రకాల ప్రయాగాలు చేస్తుంది .చివరకు సీఎం తో సహా రాష్ట్ర కాబినెట్ మంత్రులు అందరికి డివిజన్లవారీగా భాద్యతలు అప్పగించారు …వారే కాకుండా ఎమ్మెల్యేలు , ఎంపీలు , వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు ,పీసీసీ అధ్యక్షులు , తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోని పని చేస్తున్నారు …
మంత్రులకు కేటాయించిన డివిజన్లు …
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం డివిజన్ల వారీగా మంత్రులకు బాధ్యతలు..
యూసఫ్ గూడ డివిజన్ – మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్
రహమత్ నగర్ డివిజన్ – మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
వెంగల్ రావు నగర్ డివిజన్ – మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, వాకిటి శ్రీహరి
సోమాజిగూడ డివిజన్ – మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్
బోరబండ డివిజన్ – మంత్రి సీతక్క, ఎంపీ మల్లు రవి
షేక్ పేట్ డివిజన్ – మంత్రులు కొండా సురేఖ, వివేక్ వెంకటస్వామి
ఎర్రగడ్డ డివిజన్ – మంత్రులు దామోదర రాజనర్సింహ, జూపల్లి కృష్ణారావు

