సినీ కార్మికులకు సీఎం రేవంత్ రెడ్డి వరాలు..
సినీ కార్మికుల సంక్షేమ నిధికి 10 కోట్లు
సినీ కార్మికుల పిల్లలకు చదవు చెప్పించే భాద్యతకు హామీ
ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత వైద్యం అందిస్తామన్న సీఎం
రైజింగ్ తెలంగాణాలో ఫిల్మ్ ఇండస్ట్రీకి ప్రత్యేక చాప్టర్


యూసుఫ్ గూడలో సినీ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అభినందన సభ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారికీ వరాల జల్లులు కురిపించారు ..
కృష్ణా నగర్ లో ఒక మంచి స్థలాన్ని చూడండి. నర్సరీ నుంచి 12వ తరగతి వరకు కార్పొరేట్ స్థాయిలో స్కూల్ నిర్మించి సినీ కార్మికుల పిల్లలకు చదువు చెప్పించే బాధ్యత నేను తీసుకుంటానని హమీ ఇచ్చారు ..

మీ ఆరోగ్య సమస్యలకు ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత వైద్య సౌకర్యం కల్పిస్తాం. కార్మికుల సంక్షేమం కోసం సంక్షేమ నిధి ఏర్పాటు చేసుకోండి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆ సంక్షేమ నిధికి రూ.10 కోట్లు అందిస్తామన్నారు . భవిష్యత్ లో ఎంత పెద్దవారైనా అదనంగా టికెట్ల ధరలు పెంచాలనుకుంటే… అందులో 20 శాతం కార్మికుల వెల్ఫేర్ ఫండ్ కు అందిస్తేనే అనుమతి ఇచ్చేలా నిబంధనలు సడలిస్తామన్నారు రాత్రి పగలు తేడా లేకుండా పనిచేస్తున్న శ్రామికుల శ్రమ, కష్టం తనకు తెలుసునని పేర్కొన్నారు . గతంలో నిలిపివేసిన నంది అవార్డుల స్థానంలో ప్రజా యుద్ధ నౌక గద్దర్ అవార్డులను అందిస్తున్న విషయాన్నీ గుర్తు చేశారు . తెలుగు సినిమాను ఆస్కార్ స్థాయికి తీసుకెళ్లడం వెనుక సినీ కార్మికుల కష్టం ఉండనే విషయం తనకు తెలుసునని అన్నారు .
హైదరాబాద్ నగరం ప్రపంచ సినీ పరిశ్రమకు వేదిక కావాలన్నదే తమ కోరిక అంటూ తెలంగాణ రైజింగ్ 2047 ప్రణాళికలో ఫిల్మ్ ఇండస్ట్రీకి ప్రత్యేక చాప్టర్ ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కార్మికుల హర్షద్వానాల మధ్య అన్నారు ..

