Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

ఏపీ శాసనమండలి సెక్రటరీ జనరల్ గా సూర్యదేవర ప్రసన్నకుమార్ నియామకం…

  • ఇటీవల సెక్రటరీ జనరల్ పదవికి రాజీనామా చేసిన రామాచార్యులు
  • కాంట్రాక్టు పద్ధతిలో సెక్రటరీ జనరల్ పదవిని భర్తీ చేసిన మండలి
  • గతంలో వివిధ ఉన్నత పదవులు చేపట్టిన సూర్యదేవర ప్రసన్నకుమార్

ఏపీ శాసనమండలి సెక్రటరీ జనరల్ గా సూర్యదేవర ప్రసన్నకుమార్ ను ఏపీ ప్రభుత్వం నియమించింది. ఆయనను కాంట్రాక్టు పద్ధతిలో నియమిస్తూ శాసనమండలి నేడు నోటిఫికేషన్ జారీ చేసింది. ఇటీవల సెక్రటరీ జనరల్ పదవికి రామాచార్యులు రాజీనామా చేయడం తెలిసిందే. రామాచార్యులు రాజీనామాతో ఏర్పడిన ఖాళీని ప్రసన్నకుమార్ నియామకంతో భర్తీ చేశారు. 

ఖమ్మం జిల్లాకు చెందిన సూర్యదేవర ప్రసన్న కుమార్ గతంలో సుప్రీంకోర్టు రిజిస్ట్రార్ గా పనిచేశారు. లోక్ సభ స్పీకర్ కు ఓఎస్డీగా, ఢిల్లీ శాసనసభ కార్యదర్శిగా, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కార్యాలయ ఓఎస్డీగా వ్యవహరించారు. ఈ ఏడాది జనవరిలో ఆయన తెలంగాణ అసెంబ్లీ సలహాదారుగా నియమితులయ్యారు.

Related posts

548 కిలోల బరువు ఎత్తిన స్ట్రాంగెస్ట్‌ మ్యాన్‌.. 

Drukpadam

హైద్రాబాద్ డ్రగ్స్ కు అడ్డాగా మారిందా ?

Drukpadam

తెలంగాణకు రావలసిన నిధులకోసం నిర్మలా సీతారామన్ కు కేటీఆర్ లేఖ …

Drukpadam

Leave a Comment