కొత్త న్యాయ చట్టాల్లో సవరణ చేయాలి
బిఆర్ఎస్ డిప్యూటీ లీడర్ వద్దిరాజుకు ఖమ్మం బార్ సభ్యుల వినతి
కొత్త న్యాయ చట్టాల సవరణతో పాటు, సెంట్రల్ నోటరీ పబ్లిక్ అపాయింట్మెంట్, అడ్వకేట్స్ ప్రొటెక్షన్ బిల్లు తదితర అంశాలపై రాజ్యసభలో బీఆర్ఎస్ తరపున మాట్లాడాలని కోరుతూ ఖమ్మం బార్ అసోసియేషన్ ప్రతినిధులు ఢిల్లీలో ఆ పార్టీ పార్లమెంటరీ డిప్యూటీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర ను కోరారు. ఈ మేరకు తాళ్లూరి దిలీప్ చౌదరి ఆధ్వర్యంలో ఖమ్మం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు నేరెళ్ల శ్రీనివాస్, సంక్రాంతి రాజశేఖర్ తదితరులు సోమవారం ఢిల్లీలో పలువురు ఎంపీలను కలిసి వినతిపత్రాలు అందజేశారు. బార్ అసోసియేషన్ ప్రతినిధులు చేసిన విజ్ఞప్తి పై కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ కు బీఆర్ఎస్ పార్టీ పక్షాన లేఖ రాయడంతో పాటు.. సభలో ప్రస్తావన కూడా తెస్తానని హామీ ఇచ్చారు.
సెంట్రల్ నోటరీస్ లను కాల్ ఫర్ చేయాలని న్యాయవాదులు ఎంతో కాలంగా పోరాడుతున్న విషయాన్ని ఎంపీ రవిచంద్ర ప్రస్తావించారు. కొత్త న్యాయ చట్టాలపై కూడా సమీక్ష జరపాలని విజ్ఞప్తులు వస్తున్న విషయాన్ని, అడ్వకేట్ ప్రొడక్షన్ బిల్ మీద కూడా మాట్లాడతామని రవిచంద్ర హామీ ఇచ్చారు.