Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఖమ్మం వార్తలు

జక్కంపూడి దంపతుల సేవలు చిరస్మరణీయం…

ఇటీవల మృతి చెందిన తల్లాడ మండలం బిల్లుపాడు గ్రామ మాజీ సర్పంచ్ జక్కంపూడి దంపతుల సేవలు చిరస్మరణీయమని బిఆర్ఎస్ మాజీ లోక్ సభ పక్ష నేత, ఖమ్మం మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు పేర్కొన్నారు. బుధవారం నాడు మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు , సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య తో కలసి గ్రామం లోని వారి నివాసానికి వెళ్లి జక్కంపూడి కృష్ణ మూర్తి ఆయన భార్య ప్రేమలత చిత్ర పటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళ్లు అర్పించారు. వారి కుమారులు జక్కంపూడి కిషోర్, రాము లను నామ ఓదార్చి ధైర్యం చెప్పినారు, ప్రజాప్రతినిధులు గా జక్కంపూడి దంపతులు నాలుగు సార్లు సర్పంచ్ హోదాలో ఇరవై ఏళ్ళ పాటు గ్రామానికి చేసిన సేవలను అలానే తనకు జక్కంపూడి తో ఉన్న అనుబంధాన్ని ఈ సందర్భంగా నామ గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో నామ, సండ్ర వెంట సామినేని రామ అప్పారావు, సంకురాత్రి భాస్కర్ రావు, చంద్రశేఖర్, బి.ఆర్.ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు రెడ్డెం వీర మోహన్ రెడ్డి, మాజీ ఎంపీపీ దొడ్డా శ్రీను, బి.ఆర్.ఎస్ నాయకులు మోరంపూడి ప్రసాద్, నామ సేవ సమితి పాల్వంచ రాజేష్, కృష్ణప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

పది రోజుల్లో మళ్లీ వస్తా..పనుల్లో పురోభివృద్ధి లేకపోతే చర్యలు తప్పవు…మంత్రి పొంగులేటి!

Ram Narayana

గెలుపు నాదే …రూ 400 కే సిలిండర్ …మహిళకు రూ 3 వేల పెన్షన్ …కందాల

Ram Narayana

ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ వందశాతం అమలు చేస్తాం…మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

Ram Narayana

Leave a Comment