Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ రాజకీయ వార్తలు ..

బలరామునికే.. పార్టీ సారద్య బాద్యతలా …?

పీసీసీ పోస్ట్ కోసం బీసీ, ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలకు చెందిన కీలక నేతలు జోరుగా లాబీయింగ్ చేశారు. కొద్దిరోజులు ఢిల్లీలోనే మకాం వేశారు. చివరికి హైకమాండ్ ఎస్టీ నేత వైపు మొగ్గుచూపారని విశ్వసనీయ సమాచారం. అభ్యర్థి ఎవరనే అంశం కొద్దిరోజుల్లో తేలనుంది.

అంతా ఓకే.. కానీ..!!
పీసీసీ చీఫ్ ఎంపిక కోసం ఇటీవల పలుమార్లు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లారు. హైకమాండ్ పెద్దలతో మాట్లాడారు. మంత్రులు, కీలక నేతల సూచనలను కూడా అధిష్ఠానం పరిగణలోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. ఎస్టీ (లంబాడ) సామాజిక వర్గానికి చెందిన నేతకు పదవి ఇచ్చేందుకు సుముఖంగా ఉంది. మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. అతని అభ్యర్థిత్వంపై సీఎం రేవంత్ సహా మంత్రులు, కీలక నేతలు సానుకూలంగా ఉన్నారని సమాచారం. అందరి అభిప్రాయం తీసుకునే బలరాం నాయక్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారని, ప్రకటించడమే మిగిలి ఉందని కాంగ్రెస్ వర్గాల్లో జోరుగాచర్చ జరుగుతుంది.

ఆలస్యం ఎందుకంటే..? పీసీసీ చీఫ్ అభ్యర్థిత్వం కన్ఫామ్ అయ్యింది. సీఎం రేవంత్ రెడ్డి వచ్చేనెల 2వ తేదీ నుంచి విదేశాలకు వెళుతున్నారు. ఫారిన్ టూర్ ముగించుకొని 14వ తేదీన స్వదేశం తిరిగొస్తారు. ఆయన రాష్ట్రానికి వచ్చిన తర్వాత పీసీసీ చీఫ్‌ను ప్రకటిస్తారు. సీఎం రేవంత్ రాష్ట్రంలో ఉండకపోవడంతో పీసీసీ చీఫ్ అభ్యర్థి ప్రకటన వాయిదా పడింది. వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిపై స్పష్టత వచ్చిందని కాంగ్రెస్ నేతల్లో చర్చ జరుగుతోంది. బీసీ సామాజిక వర్గానికి చెందిన నేతకు కార్యనిర్వహక అధ్యక్ష పదవి ఇచ్చే అవకాశం ఉంది.

Related posts

కాంగ్రెస్‌లో చేరిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే, బీజేపీ మాజీ ఎంపీ!

Ram Narayana

తెలంగాణాలో కాంగ్రెస్ 80 సీట్లతో అధికారంలోకి వస్తుంది…రేవంత్ రెడ్డి

Ram Narayana

ముస్లింల మద్దతు ఎప్పటికీ కాంగ్రెస్ కే వుంటుంది: తుమ్మల నాగేశ్వరరావు

Ram Narayana

Leave a Comment