తెలుగు రాష్ట్రాలు

విశాఖ-సికింద్రాబాద్ వందేభారత్ రైలు షెడ్యూలులో మార్పు…మంగళవారం విరామం ….


విశాఖ-సికింద్రాబాద్ నగరాల మధ్య నడిచే సెమీ హైస్పీడ్ వందేభారత్ రైలు షెడ్యూల్ లో మార్పు చోటుచేసుకుంది. విశాఖ-వందేభారత్ రైలుకు ప్రతి మంగళవారం విరామం ప్రకటించారు. ఈ ఏడాది డిసెంబరు 10 నుంచి ఈ మార్పు అమల్లోకి వస్తుంది. ప్రస్తుతం విశాఖ-సికింద్రాబాద్ వందేభారత్ రైలు ఆదివారం మినహా వారంలోని అన్ని రోజులు నడుస్తోంది. 

విశాఖ-సికింద్రాబాద్ మధ్య రెండు వందేభారత్ రైళ్లు నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ రూట్లో ఇప్పటికే పలు ఎక్స్ ప్రెస్ రైళ్లు ఉన్నప్పటికీ, రద్దీని దృష్టిలో ఉంచుకుని రెండో వందేభారత్ రైలును కూడా కేంద్రం ఈ ఏడాది మార్చి నుంచి అందుబాటులోకి తీసుకువచ్చింది.

Related posts

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ డీజీపీ హెచ్ జే దొర మృతి..

Ram Narayana

టెక్ శంకర్ మృతి.. మావోయిస్టులకు కోలుకోలేని ఎదురుదెబ్బ!

Ram Narayana

రేపు కుటుంబ సభ్యులతో కలిసి ఢిల్లీ వెళ్లి ‘పద్మ విభూషణ్’ అందుకోనున్న చిరంజీవి…

Ram Narayana