తెలంగాణ వార్తలు

జూరాల డ్యామ్‌లో లీకేజీలు… డ్యామ్ భద్రతపై అనుమానాలు!

  • జూరాల డ్యామ్‌లోని కొన్ని గేట్లలో లీకేజీలు
  • మరమ్మతులు చేయాలని చాన్నాళ్లుగా నిపుణుల సూచనలు
  • 2021లో 62 గేట్లకు గాను ఐదింటికి మాత్రమే మరమ్మతులు

జూరాల డ్యామ్‌లో కొన్నిచోట్ల లీకేజీలు ఆందోళన కలిగిస్తున్నాయి. దీంతో ఈ డ్యామ్ భద్రతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు వరప్రదాయినిగా ఉన్న జూరాల డ్యాం భద్రతపై సండేహాలు తలెత్తుతున్నాయి. 

జూరాల డ్యాం గేట్లలో పలుచోట్ల లీకేజీలు కనిపిస్తున్నాయి. ఇది అందరికీ ఆందోళన కలిగిస్తోంది. ఈ డ్యాం గేట్లకు మరమ్మతులు చేపట్టాలని నిపుణులు చాలాకాలంగా చెబుతున్నారు. దీంతో 2021లో ప్రభుత్వం మరమ్మతుల కోసం కొన్ని నిధులను విడుదల చేసింది. నిధులు సకాలంలో విడుదల కాకపోవడంతో మొత్తం 62 గేట్లలో ఐదింటికి మాత్రమే మరమ్మతులు జరిపినట్లు అధికారులు తెలిపారు.

Related posts

రాజీవ్ స్వగృహ ఆస్తుల అమ్మకానికి ప్రభుత్వం పచ్చజెండా!

Ram Narayana

ఆర్టీసీ ఉద్యోగుల చిరకాల కోరికకు అడ్డుపడాలని లేదు: గవర్నర్ తమిళసై

Ram Narayana

ఎస్ఎల్‌బీసీ టన్నెల్‌లో కొనసాగుతున్న సహాయక చర్యలు.. రెస్క్యూ ఆపరేషన్ కోసం వచ్చిన ‘ర్యాట్ మైనర్స్’

Ram Narayana