Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
అంతర్జాతీయం

అమెరికాలో దారుణం.. యువ‌తిని కాల్చి చంపిన భార‌త సంత‌తి వ్య‌క్తి!

  • అమెరికాలోని హ్యూస్టన్‌లో ఘ‌ట‌న‌
  • ఆమె అపార్ట్‌మెంట్‌లో దోపిడీకి వెళ్లి కాల్చి చంపిన నిందితుడు బాబీ సిన్ షా
  • మృతురాలిని 21 ఏళ్ల మున పాండేగా గుర్తించిన పోలీసులు

అమెరికాలో దారుణ ఘ‌ట‌న చోటుచేసుకుంది. నేపాల్‌కు చెందిన 21 ఏళ్ల విద్యార్థినిని భారత‌ సంతతి వ్యక్తి కిరాత‌కంగా తుపాకీతో కాల్చి చంపేశాడు. హ్యూస్టన్‌లో ఆమె అపార్ట్‌మెంట్‌లో దోపిడీకి య‌త్నించిన‌ సమయంలో కాల్చి చంపినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడిని 52 ఏళ్ల బాబీ సిన్ షాగా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.

కమ్యూనిటీ కళాశాల విద్యార్థిని అయిన‌ మున పాండే సోమవారం సాయంత్రం 5.30 గంటల ప్రాంతంలో తన హ్యూస్టన్ అపార్ట్‌మెంట్‌లో తుపాకీ గాయాలతో కనిపించిందని పోలీసులు తెలిపారు. ఆమె అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లోని సిబ్బంది పోలీసులకు కాల్ చేసి ఈ సంఘ‌ట‌న గురించి స‌మాచారం ఇచ్చారు. వెంట‌నే అక్క‌డికి వ‌చ్చిన పోలీసులు పాండేను ర‌క్త‌పుమ‌డుగులో నిర్జీవంగా ప‌డిఉండ‌టాన్ని గుర్తించారు. 

అనంత‌రం రంగంలోకి దిగిన పోలీసులు హ‌త్య జ‌రిగిన‌ రెండు రోజుల తర్వాత సీసీటీవీ ద్వారా ఆమె ఇంటికి వ‌చ్చిన‌ బాబీ సిన్ షా ఫొటోను గుర్తించారు. ఆ మ‌రుస‌టి రోజే షాను అరెస్టు చేసి హత్యా నేరం మోపినట్లు పోలీసులు తెలిపారు.

‘గోఫండ్‌మీ’ పేజీ ప్రకారం మున‌ పాండే 2021లో నేపాల్ నుండి హ్యూస్టన్ కమ్యూనిటీ కాలేజీలో చదువుకోవడానికి వెళ్లారు. అపార్ట్‌మెంట్‌లో పాండే మృతదేహాన్ని గుర్తించ‌డానికి ముందు ఆమె తల్లి ఆమెతో మాట్లాడ‌టానికి రోజుల త‌ర‌బ‌డి చాలాసార్లు  ప్రయత్నించిందని నేపాల్ అసోసియేషన్ ఆఫ్ హ్యూస్టన్ సభ్యుడు ఒక‌రు న్యూయార్క్ పోస్టుతో చెప్పారు.

పాండే తల్లి హూస్టన్‌కు వెళ్లేందుకు ప్రయాణ ఏర్పాట్ల కోసం సహాయం చేసేందుకు నేపాల్ కాన్సులేట్‌తో కలిసి అసోసియేష‌న్ పని చేస్తోంది. ఇక పాండే అంత్య‌క్రియ‌తో పాటు ఆమె తల్లిని హ్యూస్టన్‌కు తీసుకురావడానికి గోఫండ్‌మీ పేజీ ద్వారా ఇప్ప‌టివ‌ర‌కు నేపాల్ అసోసియేషన్ ఆఫ్ హ్యూస్టన్ దాదాపు 30వేల డాల‌ర్ల వ‌ర‌కు పోగు చేసింది.

Related posts

భారత్ వేదికగా తొలిసారి యునెస్కో ప్రపంచ వారసత్వ కమిటీ సెషన్

Ram Narayana

బియ్యం…బియ్యం భారత్ బియ్యానికి విదేశాల్లో యమ క్రేజీ …

Ram Narayana

ఐక్యరాజ్య సమితిలో పాలస్తీనాకు మద్దతిచ్చిన భారత్

Ram Narayana

Leave a Comment