Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఖమ్మం వార్తలు

వరద భాదిత తోటి సభ్యులకు ఫోటో గ్రాఫర్ల యూనియన్ 10 లక్షల ఆర్థిక సహాయం !

వరద బాధిత ఫోటో మరియు వీడియో గ్రాఫర్ కుటుంబాలకు 10 లక్షల
ఆర్ధిక సహాయం .

సెప్టెంబర్ 1 ఖమ్మం నగరం చరిత్రలో కనివిని ఎరుగని రీతిలో మున్నేరు వరద ఖమ్మం చుట్టూ పక్కల కాలనీలకు రావడం వలన చాలా మంది నిరాశ్రయులు అయ్యారు. వారిలో ఖమ్మం ఫోటో గ్రాఫర్ కుటుంబాలు చాలా ఉన్నాయి.ఖమ్మం ఫోటోగ్రఫీ యూనియన్ నాయకులు వారిని పరామర్శించి వారిలో 26 మందిని తీవ్ర నష్టానికి గురి అయిన బాధితులుగా గుర్తించి వారికి తక్షణ సహాయం చేసారు.
జిల్లా యూనియన్ ఫండ్, రాష్ట్ర యూనియన్ ఫండ్, ఖమ్మం ఫోటో గ్రాఫర్స్ విరాళాలు,రాష్ట్ర వ్యాప్తంగా వివిధ మండలాల, జిల్లా నుండి ఫోటోగ్రాఫర్స్ విరాళాలు,LED ఓనర్స్ అసోసియేషన్స్ విరాళాలు,ఇతర దాతల నుండి సేకరించిన మొత్తం విరాళాలు సుమారు పది లక్షలు ఇవ్వడం జరిగింది. ఇందులో తక్షణ సహాయం గా 26 మందికి ప్రతీ ఒక కుటుంబానికి 35,000/- రూపాయల నగదు,3000/- విలువ గల సరుకులు ఇవ్వడం జరిగింది.
జిల్లా అధ్యక్షులు నాగరాజు దేవర అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమం స్థానిక జూబ్లీక్లబ్ లో జరిగింది. ఈ కార్యక్రమం లో ,రాష్ట్ర కార్యదర్శులు మారగని వెంకట్ గారు, కన్నె గుండ్ల అశోక్ గారు జిల్లా కోశాధికారి ఆర్ కె బాబాయ్ గారు, ఖమ్మం పట్టణ అధ్యక్షులు కమఠం రఘు గారు , సెక్రెటరీ ఖాజబాబా గారు , కోశాధికారి నీరుడు తిరుపతి రావు గారు ,జిల్లా వైస్ ప్రెసిడెంట్ సుధాకర్ గారు,.
వైస్ ప్రెసిడెంట్ రంజిత్ గారు, రూరల్ మండలం అధ్యక్షులు మల్లెల వీరన్న గారు, , ఖమ్మం టౌన్ కమిటీ సభ్యులు పవన్, అఖిల్, మీరా, ఖమ్మం టౌన్ మాజీ అధ్యక్షులు బండారు శేషగిరి గారు,LED ఓనర్స్ గణేష్ గారు, సైదులు గారు, రూరల్ గౌస్ .రవి .సంగయ్య
తల్లాడ అధ్యక్షులు చెర్రీ ప్రసాద్ .రఘునాథ పాలెం బాలాజీ నాయక్. యసీన్
సీనియర్ ఫోటోగ్రాఫర్స్ గురువా రెడ్డి గారు, ఒమేగా శ్రీకాంత్, గౌస్ గారు, సినిమాటిక్ తిరు, కొండ నరేష్,ఇతర ఫోటోగ్రాఫర్ మిత్రులు పాల్గొన్నారు. సహాయం పొందిన 26 కుటుంబాలు ఆపద కాలంలో వారిని ఆదుకున్నందుకు గాను ఫోటోగ్రాఫి యూనియన్ కూ, ప్రతీ ఫోటో గ్రాఫర్ కు, ఇతర దాతలకు ధన్యవాదాలు తెలియజేశారు.

Related posts

జక్కంపూడి దంపతుల సేవలు చిరస్మరణీయం…

Ram Narayana

ఖమ్మంలో తుమ్మల వర్సెస్ పువ్వాడ నామినేషన్ లొల్లి…

Ram Narayana

సిపిఎంకు వేసే ప్రతి ఓటు ఒక పోరాట ఆయుధమే…సిపిఎం అభ్యర్థి శ్రీకాంత్

Ram Narayana

Leave a Comment