క్రైమ్ వార్తలు

ఛత్తీస్ గఢ్ లో దారుణం… చేతబడి అనుమానంతో ఐదుగురి హత్య!

  • అనారోగ్యానికి గురైన ఓ కుటుంబంలోని వ్యక్తి 
  • చేతబడి వల్లనే అని భావించిన గ్రామస్తులు
  • ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురిని అంతమొందించిన వైనం
  • మృతుల్లో ముగ్గురు మహిళలు

సాంకేతికత కొత్త పుంతలు తొక్కుతున్న ఈ రోజుల్లోనూ చేతబడి వంటి మూఢనమ్మకాలు తొలగిపోలేదు. ముఖ్యంగా, గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి క్షుద్ర ఆచారాలకు ఎంతోమంది బలవుతున్నారు. తాజాగా, చేతబడి చేస్తున్నారనే అనుమానంతో ఐదుగురు హత్యకు గురయ్యారు. 

ఛత్తీస్ గఢ్ లోని సుక్మా జిల్లాలో ఈ దారుణం చోటుచేసుకుంది. మృతులు అందరూ ఒకే కుటుంబానికి చెందినవారు. మృతుల్లో ముగ్గురు మహిళలు ఉన్నారు. 

సుక్మా జిల్లాలోని కుంట పోలీస్ స్టేషన్ పరిధిలో ఇట్కల్ గ్రామం వద్ద ఈ ఘటన జరిగింది. చేతబడి వల్ల ఓ కుటుంబంలోని వ్యక్తి అనారోగ్యానికి గురయ్యాడన్న అనుమానంతో ఈ హత్యలు జరిగినట్టు తెలుస్తోంది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

Related posts

నవీన్ రెడ్డి మాటలు నమ్మొద్దు… అతడిని నేను పెళ్లి చేసుకోలేదు: వైశాలి!

Drukpadam

టెక్సాస్ లో గుడికి వెళ్లిన కొడుకుకు వాతలు పెట్టిన పూజారులు.. 8 కోట్లకు తండ్రి దావా

Ram Narayana

బోనీ కపూర్ కారులో 66 కిలోల వెండి వస్తువుల సీజ్…

Drukpadam