Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ వార్తలు

50 వసంతాల పి డి ఎస్ యు పోరాటాల చరిత్ర అజరామం!

ప్రగశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పీడీఎస్ యూ తన 50 ఏళ్ల పోరాటాల చరిత్ర అజరామమని ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ ఖాసిం సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు అన్నారు. ఆదివారం ఖమ్మం ఎస్సార్ అండ్ బిజీ యన్ ఆర్ కళాశాలలో జరిగిన పీడీఎస్సీయూ పూర్వం విద్యార్థుల సమ్మేళనంలో వారు మాట్లాడుతూ కుల వివక్ష మతోన్మాద శక్తులకు వ్యతిరేకంగా విప్లవ ధ్రువతార… ఇండియన్ చేగువేరా కామ్రేడ్ జార్జిరెడ్డి నేత్రుత్వంలో.. పోరాటల పురిటిగడ్డ ఉస్మానియా యూనివర్సిటి వేదికగా ఆవిర్భవించన పీడీఎస్ యూ ఎందరో ప్రగతి కాముకులకు ఊపిరులూదిందన్నారు .. నియంతృత్వ, భూర్జువా, భూస్వ్యామ్య పాలనపై జంగ్ సైరన్ మోగించి దేశంలో కొట్లాది మంది ప్రగతి కాముల పోరుబాటకు బాసటగా నిలిచిందన్నారు . నగ్జల్బరీ సాయుధ రైతాంగ ఉద్యమానికి రుధిర తిలకం దిద్దిన మహోన్నత చరిత్ర కలిగిన విద్యార్థి సంఘం పీడీఎస్ యూ దన్నారు .. మార్క్సిస్ట్ మహోపాధ్యాయుల దిశానిర్దేశంలో… పీడిత ప్రజల బానిస విముక్తి కోసం… శాస్త్రియ యుద్ధ పంధాను పరిచయం చేసిన చరిత్ర కలిగిన సంఘమని కొనియాడారు . వేలాది మంది రక్త తర్పణంతో అరుణారుణ ఉషోదయపు బాటలు పరిచి.. నాడు.. నేడు పాలకుల వెన్నులో వణుకు పుట్టిస్తున్న ‘ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం ‘ ప్రాణం పోసుకుని 50 వసంతాలు గడిచిన నేపథ్యంలో.. దేశంలో విద్యార్థి ఉద్యమాలపై సమీక్ష చేసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రగతిశీల ఉద్యమాలు లేకనే మత ఉన్మాదులు పెచ్చీర్లుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు .దేశంలో భిన్నత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత దేశ ప్రజలపై బుద్ధి జీవులపై ప్రధానంగా ఉందని వారు గుర్తు చేశారు. దేశ సమగ్రతకు భంగం కలిగే విధంగా కొన్ని శక్తులు పరిపాలన కొనసాగిస్తున్నాయని మధ్యతరగతి జీవుల్లో వీటి పట్ల స్పందన లేదని వారన్నారు. అన్ని వర్గాలను చైతన్యం చేసే బాధ్యత ఇవాళ విప్లవ విద్యార్థి ఉద్యమాలపై ఉందన్నారు . ఈ క్రమంలో దేశంలో ఉన్న భిన్నత్వాన్ని కాపాడాల్సిన బాధ్యత పౌర ప్రజాస్వామిక శక్తులపై ఉందని వారు గుర్తు చేశారు. సెప్టెంబర్ 30న హైదరాబాదులో జరిగే 50 వసంతాల పిడిఎస్ యూ స్వర్ణోత్సవ వేడుకకు పెద్ద ఎత్తున తరలిరావాలని వారు పిలుపునిచ్చారు.

కార్యక్రమానికి ముందు పిడిఎస్ జెండాని పూర్వం విద్యార్థి వడ్డెల్లి కృష్ణమూర్తి ఆవిష్కరించారు. పూర్వ విద్యార్థి రాయల రవికుమార్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ కొండా నాగేశ్వరరావు, పురుషోత్తం, మనోహర్ రాజు, రమేష్, తిరుమలరావు, ఎం పుల్లయ్య, రామచంద్రరావు, వై నాగేశ్వరరావు, పి నాగేశ్వరరావు, విజయ్, నాగిరెడ్డి, రామారావు, నరేందర్, గుర్ర అచ్చయ్య, నరేందర్, ఆవుల అశోక్, శివయ్య, పుల్లయ్య, అర్జున్ రావు, రామయ్య ,వెంకటేశ్వర్లు, నాగవర్ధన్, ప్రదీప్, భరత్ ,శిరోమణి, ఝాన్సీ, లక్ష్మి, కల్పన, వెంకటేష్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఆర్టీసీ ఉద్యోగుల చిరకాల కోరికకు అడ్డుపడాలని లేదు: గవర్నర్ తమిళసై

Ram Narayana

విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా బుర్రా వెంకటేశం, వైద్య శాఖ కార్యదర్శిగా క్రిస్టినా… తెలంగాణలో ఐఏఎస్ ల బదిలీలు

Ram Narayana

మరో నెల రోజులు జైలులోనే కవిత.. కారణం ఇదే!

Ram Narayana

Leave a Comment