Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఖమ్మం వార్తలు

సాగర్ గండ్లు పడింది ..సీతారాం ఏమైంది …మాజీ ఎమ్మెల్యే సండ్ర

గండ్లు పడినకారణంగా సాగర్ నీళ్లు రావు …అడావుడి ఆర్బాటంగా ప్రారంభించిన సీతారాం ఏమైందని మాజీ శాసనసభ్యులు సండ్ర వెంకటవీరయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు …ప్రభుత్వం ముందు చూపులేని కారణంగా సకాలంలో గండ్లు పూడ్చలేదని విమర్శలు గుప్పించారు ..ఇది రైతుల పాలిట శాపంగా మారిందని ధ్వజమెత్తారు ..
ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల నాగార్జునసాగర్ ఎడమ కాలువకు గండ్లు పడి ప్రణాళిక బద్దంగా సకాలంలో గండ్లు పూడ్చక పోవడంతో నీరు ఉండి కూడా అందక ఖమ్మం జిల్లాలో పంటలు ఎండిపోయి తీవ్ర నష్టం జరిగిందని ఆందోళన వ్యక్తం చేశారు .. సరైన ప్రణాళిక, చర్యలు చేపట్టకపోవడం వల్లనే ఈ దుస్థితి నెలకొందని అన్నారు …

ఇటీవలనే సీతారామ ప్రాజెక్టును నాగార్జునసాగర్ కు అనుసంధానం చేసినట్లుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రగల్భాలు పలికిందని , ఆ నీటినైనా విడుదల చేసేందుకు కార్యచరణ చేయకపోవడం శోచనీయమన్నారు. కెసిఆర్ ప్రభుత్వంలో నాగార్జున సాగర్ 500 అడుగుల నీరు ఉన్నా కూడా రైతుల పంటలను కాపాడారని అన్నారు … నాగార్జునసాగర్ నీరు లేకపోయిన కాలేశ్వరం నుండి ఎస్సారెస్పీ ద్వారా పాలేరు చెరువులో నింపి మూడు పంటలకు తడుల నీరు అందించి రైతులను కేసీఆర్ ఆదుకున్నామని తెలిపారు.
జిల్లాలో ముగ్గురు మంత్రులు నుండి కూడా రైతులను ఆదుకోవడంలో వైఫల్యం చెందటం పట్ల రైతులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న విషయాన్నీ మరిచిపోరాదని అన్నారు . ఒక పక్క వరదలు మరోపక్క ప్రాజెక్టుల్లో పుష్కలంగా నీరు ఉన్నా సరైన ప్రణాళికలు లేక నీరు ఇవ్వలేక పోతున్న అసమర్థ ప్రభుత్వమని రైతులు అనుకుంటున్నారని ప్రభుత్వ విధానాలను దుయ్యబట్టారు .సకాలంలో గండ్లు పుడ్చక ప్రభుత్వ వైఫల్యంతో రైతులకు పంట నష్టం జరిగిందన్నారు. నష్టపోయిన రైతులకు ఎకరానికి 20,000 రూపాయలు నష్టపరిహారం ప్రభుత్వం ఇచ్చినా కూడా వారి నష్టాన్ని పూడ్చలేనిది పేర్కొన్నారు .
ఇప్పటికైనా వెంటనే ప్రభుత్వం ప్రణాళిక బద్దంగా నీటిని వదలకపొతే రైతులు పెద్ద ఎత్తున నిరసనను వ్యక్తం చేసి ప్రభుత్వాన్ని ఎండగట్టేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. నీటిని వదిలేందుకు వెంటనే సత్వర చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
నష్టపోయిన రైతులకు నష్టపరిహారంగా 20వేల రూపాయలు అందించాలన్నారు .

Related posts

గెలుపు నాదే …రూ 400 కే సిలిండర్ …మహిళకు రూ 3 వేల పెన్షన్ …కందాల

Ram Narayana

ఖమ్మాన్ని ముంచిన మున్నేరు …జలదిగ్బంధనంలో పలు కాలనీలు

Ram Narayana

ఖమ్మం జిల్లా బీఆర్ యస్ యూత్ అధ్యక్షుడు కృష్ణ చైతన్య పార్టీకి గుడ్ బై …

Ram Narayana

Leave a Comment