ఢిల్లీలో ఏపీ ,తెలంగాణ సీఎం ల మాటామంతి
వామపక్ష తీవ్రవాదం పై హోమ్ మంత్రి ఆధ్వరంలో జరిగిన సమావేశం
హాజరైన చంద్రబాబు ,రేవంత్ రెడ్డి
ఈసందర్భంగా తెలుగు రాష్ట్రాల సమస్యలపై సమాలోచనలు
ఢిల్లీలో సోమవారం కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా ఆధ్వరంలో జరిగిన వామపక్ష తీవ్రవాద రాష్ట్రాల ముఖ్యమంత్రులతో జరిగిన సమావేశంలో ఏపీ ,తెలంగాణ సీఎం లు చంద్రబాబు , రేవంత్ రెడ్డిలు పాల్గొన్నారు …ఈ సందర్భంగా వారు మధ్య మాటామంతి నడిచింది …తెలుగు రాష్ట్రాల్లో ఉన్న సమస్యలపై చర్చించారు …అవసరమైతే మళ్ళీ ఒకసారి ఇద్దరు సీఎంలు ఒక ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేయాలనీ అనుకున్నట్లు సమాచారం ..
వామపక్ష తీవ్రవాద ప్రాంతాల్లో సీఎం లు నెలకు ఒకసారి , డీజీపీలు నెలకు రెండు సార్లు పర్యటించాలని హోమ్ మంత్రి అమిత్ షా సీఎం లకు డీజీపీలకు సూచించారు …ఇప్పటికే ఆరు రాష్ట్రాల్లో కొనసాగుతున్న మావోయుస్టుల కార్యక్రమాలు ఉన్నాయని అయితే తీసుకున్న పకడ్బందీ చర్యలవల్ల బాగా తగ్గిందని ఉన్న కొద్దో గొప్పో 2026 పూర్తిగా లేకుండా చేయాలనీ అందుకు కేంద్ర రాష్ట్ర బలగాలు సమన్వయంతో పనిచేయాలని హోమ్ మంత్రి దిశానిర్దేశం చేయాలనీ అన్నారు …లక్షలాదిమంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారని , అనేక మండి నిరాశ్రయులైయ్యారని ,అంగ వైకల్యం చెందారని అన్నారు …మరి కొద్దీ నెలల్లోనే అసలు ఆప్రాంతాల్లో వామపక్ష తీవ్రవాదం లేకుండా చేయగలుగుతామని విశ్వాసం వ్యక్తం చేశారు ..రెండు రోజుల క్రితం ఛత్తీస్ ఘడ్ లోని అబూజు మాడ్ ప్రాంతంలో మావోలపై పై చేయి సాధించిన విషయాన్నీ కూడా సమావేశంలో వివరించారు ..
హోమ్ మంత్రిని కలిసి సమస్యలు విసరించిన సీఎం రేవంత్ రెడ్డి
భారీ వర్షాలు, వరదల కారణంగా దెబ్బతిన్న మౌలిక వసతుల పునరుద్ధరణ, మరమ్మతు పనులకు రూ. 11,713.49 కోట్లు సత్వరమే విడుదల చేయాలని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. వారిని ఢిల్లీలో కలిసి వరద నష్టంపై సమగ్రమైన నివేదికను అందించి తగిన విధంగా ఆదుకోవాలని కోరారు.
అలాగే, తెలంగాణలో వామపక్ష తీవ్రవాద ప్రభావం, పెండింగ్ లో ఉన్న రాష్ట్ర పునర్విభజన సమస్యలు, రాష్ట్రానికి ఐపీఎస్ ల కేటాయింపు వంటి పలు అంశాలపై అమిత్ షా గారితో చర్చించి సహకరించాలని కోరారు.
🔹ముఖ్యమంత్రి కేంద్ర మంత్రి దృష్టికి తెచ్చిన పలు వివరాలు..
🔹తెలంగాణలో భారీ వర్షాలు, వరదల కారణంగా 37 మంది ప్రాణాలు, లక్షకు పైగా పశువులు, ఇతర మూగ జీవాలు మృతి చెందాయి. 4.15 లక్షల ఎకరాల్లో పంటతో పాటు రోడ్లు, కల్వర్టులు, కాజ్‌వేలు, చెరువులు, కుంటలు, కాలువలు దెబ్బతిన్నాయి.
🔹ప్రాథమిక అంచనాల మేరకు రూ. 5,438 కోట్లు మేరకు వరద నష్టం వాటిల్లినట్టు సెప్టెంబరు రెండో తేదీన లేఖ రాశాం. ఆ తర్వాత సెప్టెంబర్ 11 నుంచి 13 తేదీల్లో కేంద్ర బృందం పర్యటించి 30 వ తేదీన కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది.