Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఖమ్మం వార్తలు

ఆప్తమిత్రుడు బొప్పన గాంధీ కి ఘన నివాళ్లు అర్పించిన మాజీ ఎంపీ నామ

ఖమ్మం పట్టణానికి చెందిన ప్రముఖ గ్రానైట్ వ్యాపారి బొప్పన గాంధీ మృతి పట్ల బీఆర్‌ఎస్‌ మాజీ లోక్‌సభపక్ష నేత, ఖమ్మం మాజీ పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు సంతాపం తెలిపారు. చిరకాల మిత్రుడిని కోల్పోవడం బాధాకరమని ఆయన పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా గ్రానైట్ పరిశ్రమ అభివృద్ధిలో గాంధీ చేసిన కృషి మరువలేనిదని, పరిశ్రమను ఉన్నతస్థాయికి తీసుకెళ్లడంలో ఆయన పాత్ర విశేషమని అభినందించారు. కొద్ది రోజుల క్రితం అమెరికాలో మృతి చెందిన బొప్పన గాంధీ భౌతికకాయాన్ని గురువారం నాడు ఖమ్మం నగరంలోని బ్యాంకు కాలనీలోని సృజన అపార్ట్‌మెంట్‌లో ఉన్న వారి నివాసానికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా నామ నాగేశ్వరరావు, నామ సోదరుడు శీతయ్య పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం గాంధీ కుటుంబ సభ్యులను నామ పరామర్శించి, ఆప్తమిత్రుడి పాడే మోసి తమ మధ్య ఉన్న స్నేహ బంధం ఎలాంటిదో చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం ఎంఎల్ఏ కూనంనేని సాంబశివరావు, నామ కుటుంబ సభ్యులు, పలువురు రాజకీయ నాయకులు, గ్రానైట్ యజమానులు, బొప్పన గాంధీ శ్రేయోభిలాషులు పాల్గొన్నారు.

Related posts

పాలేరు ,ఖమ్మంలలో కాంగ్రెస్ జెండా ఎగరాలి …తుమ్మల , పొంగులేటి

Ram Narayana

సకాలంలో గుర్తిస్తే క్యాన్సర్‌తో ప్రమాదం లేదు…

Ram Narayana

ఇది ప్రజాగెలుపు రామసహాయం విజయంపై మంత్రి పొంగులేటి స్పందన …

Ram Narayana

Leave a Comment