Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ రాజకీయ వార్తలు ..

ఏఐసీసీకి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సంచలనం లేఖ…

నన్ను సంపుకుంటారా.. సాదుకుంటారా! భవిష్యత్ మీ చేతుల్లో ఉంది .. పార్టీ ,రాహుల్ గాంధీ పాంచ్ న్యాయ్ మేనిఫెస్టో కు విరుద్ధంగా ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారు …10 ఎమ్మెల్యేలను తీసుకోవడం అవసరమా…? అని కాంగ్రెస్ సీనియర్ నేత ఎమ్మెల్యేకి జీవన్ రెడ్డి ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేకి , పార్లమెంటరీ పార్టీ చైర్మన్ సోనియా గాంధీ , లోకసభలో కాంగ్రెస్ పక్ష నేత రాహుల్ గాంధీకి , లేఖలు రాశారు ..దీని కాపీలను పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కు , సీఎం రేవంత్ రెడ్డికి , డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కు పంపారు …ఫిరాయింపులను ప్రోత్సాహం అన్నట్లుగా బీఆర్ యస్ నుంచి వచ్చిన పోచారం శ్రీనివాస్ రెడ్డికి సలహాదారు పదవి ఇచ్చారు … పోచారం శ్రీనివాస్ రెడ్డి పార్టీ ఫిరాయింపులకు సలహాలు బాగా ఇస్తాడు – కాంగ్రెస్ లోకి ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో కాంగ్రెస్ కార్యకర్తలు ఇబ్బందులు పడుతున్నారు. అభివృద్ధి పేరిట సీఎం రేవంత్ రెడ్డి ఫిరాయింపులను చేస్తున్నారు …ఇది రాహుల్ గాంధీ పాంచ్ న్యాయ్ మేనిఫెస్టో కు విరుద్ధం అని గుర్తు చేశారు ..గంపగుత్తగా 10 మంది ఎమ్మెల్యేలను వేరే పార్టీలో నుండి తీసుకొని ప్రభుత్వాన్ని నడపాలా? – ప్రజా ప్రతినిధులు పార్టీ ఫిరాయింపులు చేస్తే వారి సభ్యత్వం రద్దు చేయాలని అన్నారు ..

కానీ రాహుల్ గాంధీ మాటను పక్కన పెట్టి రాష్ట్ర కాంగ్రెస్ నేతలు పార్టీ ఫిరాయింపులకు ప్రోత్సహిస్తున్నారు – కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి…రేవంత్ రెడ్డి మీద జీవన్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు .. అందువల్ల నన్ను సంపుకుంటారా.. సాదుకుంటారా! అంటూ తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న పరిణామాలపై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి హైకమాండ్ కు సంచలన లేఖ రాశారు .. తీవ్ర ఆందోళన మానసిక వ్యధ బాధాతప్త హృదయంతో లేఖ రాస్తున్నట్టు పేర్కొన్నారు …తన రాజకీయ భవిష్యత్ పై మీరే నిర్దేశించండి అని ఆలేఖలో జీవన్ రెడ్డి కోరారు …

Related posts

కేసీఆర్‌కు మళ్లీ అవకాశమిస్తే ప్రగతి భవన్, ఫామ్‌హౌస్‌కే పరిమితం: ఈటల రాజేందర్

Ram Narayana

Ram Narayana

పరిపాలన మీకు మాత్రమే తెలుసని అనుకోవద్దు: కేటీఆర్ పై పొన్నం ప్రభాకర్ విమర్శలు

Ram Narayana

Leave a Comment