ఏపీలో టీడీపీ ,వైసీపీ ఢీ అంటే ఢీ …
సోషల్ మీడియా లో యుద్ధం …పోస్టులపై పోస్టులు
నీది బయటపెడమంటే నీది బయట పెడతామని బెదిరింపులు
ఇప్పటికే తెరిచినా పుస్తకంలా వారి ప్రకటనలు
ఇప్పుడు ఎం బయట పెడతారనోనని ఉత్కంఠ
టీడీపీ, వైఎస్ఆర్ సీపీ సోషల్ మీడియాలో పోస్టులు రోజుకొక మలుపు తిరుగుతున్నాయి ..పోస్టులలో ఎవరికీ వారు పై చేయి సాదించేందుకు ఎత్తులు పై ఎత్తులు వేస్తున్నారు … ఎదో కొత్త విషయం బయటపెడతామని బెదిరింపులు కూడా తారాస్థాయికి చేరుకున్నాయి.. ఏం బయటపెడతారు?అనేది ఉత్కంఠంగా మారింది …
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అక్టోబర్ 24న సంచలన విషయాలు బయట పెడతామని వైఎస్ఆర్ సీపీ, టీడీపీలు సోషల్ మీడియాలో పోస్టు చేశాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అక్టోబర్ 24న సంచలన విషయాలు బయట పెడతామని వైఎస్ఆర్ సీపీ, టీడీపీలు సోషల్ మీడియాలో పోస్టు చేశాయి. అసలు ఈ రెండు పార్టీలు ఏ అంశాలను బయట పెడతారనే విషయమై ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. రాష్ట్ర ప్రభుత్వ విధానాలను జగన్ ఎప్పటికప్పుడు విమర్శలు చేస్తున్నారు. ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో ప్రభుత్వం వైఫల్యం చెందిందని ఆయన ఆరోపణలు చేస్తున్నారు. మరో వైపు గత ప్రభుత్వ తీసుకున్న విధానాలతో ప్రజలు ఎలా ఇబ్బందిపడ్డారో తెలుగుదేశం పార్టీ నాయకులు గుర్తు చేస్తున్నారు. జగన్ పాలనకు తమ పాలనకు మధ్య తేడాను గమనించాలని ప్రజలను కోరుతున్నారు.
Save or share this story as a newspaper-style Epaper Clip: