Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

శ్రీశైలం మల్లన్నకు కానుకల ద్వారా భారీ ఆదాయం…

  • శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయానికి రికార్డు స్థాయిలో ఆదాయం
  • భక్తులు సమర్పించిన కానుకల ద్వారా రూ.2 కోట్ల 58 లక్షలకుపైగా ఆదాయం
  • కానుకల్లో భారీగా విదేశీ కరెన్సీ  

శ్రీశైలంలోని భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి వారి ఆలయానికి హుండీ కానుకల ద్వారా రికార్డు స్థాయిలో ఆదాయం వచ్చింది. చంద్రావతి కల్యాణ మండపంలో గురువారం ఆలయ అధికారులు సిబ్బందితో హుండీ కానుకల లెక్కింపు నిర్వహించారు. హుండీ కానుకల ద్వారా రూ.2,58,56,737ల ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. 

అలాగే 379 గ్రాముల బంగారు అభరణాలు, సుమారు 8.80 కేజీల వెండి ఆభరణాలు కూడా కానుకలుగా వచ్చాయన్నారు. వీటితో పాటు పెద్ద ఎత్తున విదేశీ కరెన్సీ కూడా కానుకలుగా వచ్చాయని ఆయన తెలిపారు. వాటిలో యూఎన్ఏ డాలర్లు 1093, కెనడా డాలర్లు 215, యూకే పౌండ్స్ 20, యూఏఈ ధీర్హామ్స్ 10, మలేషియా రింగేట్స్ 21, మాల్దీవ్స్ రుఫియాస్ 10, ఈరోస్ 10, సింగపూర్ డాలర్లు 2, మారిటియస్ 25 కరెన్సీ ఉన్నాయని చెప్పారు. ఈ ఆదాయం కేవలం 28 రోజులుగా స్వామివారికి భక్తులు కానుకలుగా సమర్పించడం ద్వారా వచ్చిందని ఈవో తెలిపారు.    

Related posts

స్వలింగ వివాహాలను గుర్తించబోమన్న కేంద్రం!

Drukpadam

అన్న కొడుకు పెళ్ళిలో అంతా తానై వ్యవహరించిన మంత్రి పువ్వాడ అజయ్ …

Drukpadam

అన్నయ్య రాహుల్ కు షూటింగ్ లో ఘనాపాటి …పతకాలు ఎన్నో …ప్రియాంక గాంధీ

Drukpadam

Leave a Comment