జాతీయ వార్తలు

బాంబు బెదిరింపు… ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చే విమానం దారి మళ్లింపు..! 

  • పది రోజులుగా దేశవ్యాప్తంగా పలు విమానాలకు బాంబు బెదిరింపులు 
  • ఈరోజు మూడు విమానయాన సంస్థలకు బాంబు బెదిరింపు మెయిల్స్
  • బెదిరింపుల నేపథ్యంలో అప్రమత్తమైన అధికారులు

ఢిల్లీ – హైదరాబాద్ విమానానికి బాంబు బెదిరింపు రావడంతో అధికారులు దారి మళ్లించారు. గత పది రోజులుగా దేశవ్యాప్తంగా పలు విమానాలకు బాంబు బెదిరింపు హెచ్చరికలు వస్తున్నాయి. నిన్న ఒక్కరోజే పదుల సంఖ్యలో విమానాలకు బెదిరింపులు వచ్చాయి.

ఈ రోజు మూడు విమానయాన సంస్థలకు బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. ఇండిగో, విస్తారా, ఆకాశ ఎయిర్ లైన్స్‌కు చెందిన విమానాలకు బాంబు బెదిరింపులు రావడంతో ఆయా సంస్థల అధికారులు అప్రమత్తమయ్యారు. విమానాశ్రయాల్లో భద్రతా సిబ్బంది క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించింది. ఈ క్రమంలో ఢిల్లీ నుంచి హైదరాబాద్ రావాల్సిన విస్తారా విమానాన్ని దారి మళ్లించారు.

Related posts

ప్రమాదంలో ఉన్నామని చెప్పినా… ఇండిగో విమానానికి దారివ్వని పాకిస్థాన్!

Ram Narayana

ఆస్ట్రేలియా బాటలో భారత్.. పిల్లల సోషల్ మీడియా వాడకంపై నిషేధం?

Ram Narayana

పోస్టల్ డిపార్ట్ మెంట్ నుంచి కొత్త యాప్…

Ram Narayana