Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ రాజకీయ వార్తలు ..

ఉత్తమ్ ,భట్టి ,కోమటిరెడ్డి ,పొంగులేటిలలో ఒకరు సీఎం …బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి జోష్యం!

తెలంగాణాలో వచ్చే ఏడాదిలో ముఖ్యమంత్రి మారడం ఖాయమని బీజేపీ ఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి జోష్యం చెప్పారు … ఉత్తమ్ ,భట్టి ,కోమటిరెడ్డి ,పొంగులేటిలలో ఒకరు సీఎం అయ్యే అవకాశాలు ఉన్నాయని అన్నారు …బుధవారం మీడియాతో మాట్లాడిన ఆయన తెలంగాణ రాజకీయాలపై సంచలన కామెంట్స్ చేశారు …రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ అధిష్టానానికి భ్రమలు తొలగాయని , ఆయన పాలనలో పార్టీకి నష్టం జరుగుతుందనే నివేదికలు ఉన్నాయని , కొందరు మంత్రులు కూడా ఈ విషయాన్నీ అధిష్టానం దృష్టికి తెచ్చారని పేర్కొన్నారు …దీన్ని కాంగ్రెస్ పార్టీ కొట్టి పారేసింది ….మహేశ్వరరెడ్డివి అపరిపక్వత రాజకీయాలని ,ఆధారం లేని ఆరోపణలు చేస్తున్నారని కాంగ్రెస్ నేతలు అంటున్నారు ..పేపర్లలో వార్తల కోసం ఇలాంటి చౌకబారు విమర్శలు మానుకోవాలని హితవు పలుకుతున్నారు …

మీడియాతో మహేశ్వర్ రెడ్డి ఏమన్నారంటే …

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆ పార్టీ నేతలపై బీజేఎల్పీ నాయకుడు యేలేటి మహేశ్వర్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. బుధవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డికి అపాయింట్‌మెంట్ ఇవ్వడం లేదన్నారు. 2025 జూన్ నుంచి డిసెంబర్‌లోగా తెలంగాణకు కొత్త ముఖ్యమంత్రి రాబోతున్నారని జోస్యం చెప్పారు యేలేటీ. కేరళలో ప్రియాంక గాంధీ నామినేషన్ వేసేటప్పుడు వెళ్లినా.. రేవంత్‌ను రాహుల్ గాంధీ కలవలేదన్నారు. ఢిల్లీలో మూడుసార్లు రాహుల్ గాంధీ అపాయింట్‌మెంట్ ఇవ్వకపోవడంతో.. ఖాళీగా తిరిగి వచ్చారన్నారు. దీనికి సంబంధించి పక్కా ఆధారాలు తన వద్ద ఉన్నాయని మహేశ్వర్ రెడ్డి తెలిపారు .

మూసీ అంశాన్ని ఒరిజినల్ కాంగ్రెస్ మంత్రులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని బీజేఎల్పీ నేత వ్యాఖ్యానించారు. ఇదే విషయాన్ని సదరు నేతలు ఎప్పటికప్పుడు అధిష్టానానికి చెప్తున్నారని పేర్కొన్నారు. నేరుగా కొంత మంది, మెయిళ్ల ద్వారా కొంతమంది, ఇతర మార్గాల ద్వారా మరికొంత మంది చేరవేస్తున్నట్లు మహేశ్వర్ రెడ్డి తెలిపారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక భారీగా వసూళ్లకు పాల్పడుతున్నారని మంత్రులు, అధిష్టానం నమ్ముతుందని.. ఇది సాధారణ ప్రజల్లోకి సైతం చేరిందన్నారు. సెలక్షన్, కలక్షన్, కరప్షన్ అనేదిముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విధానమని కాంగ్రెస్‌ హైకమాండ్‌కు ఆధారాలతో సహా వెళ్లినట్లు తమకు పక్కా సమాచారం ఉందన్నారు మహేశ్వర్ రెడ్డి. మూసీ, హైడ్రా మీద కాంగ్రెస్ అధిష్టానానికి అనేక అనుమానాలు ఉన్నాయని మహేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి.. వైఎస్ఆర్ కంటే ప్రమాదకరం అనే భావనలో కాంగ్రెస్ హైకమాండ్ ఉందన్నారు. రేవంత్ రెడ్డి సెల్ఫ్ ఎజెండా మీద మాజీ కేంద్ర మంత్రి పల్లం రాజు పూర్తి నివేదికను సోనియా గాంధీకి అందజేశారన్నారు. లక్షా యాభై వేల కోట్లతో మూసీ ప్రాజెక్టు అంశాన్ని పార్టీ అధిష్టానం వద్ద రేవంత్ రెడ్డి దాచిపెట్టారన్నారు. అనేక సందర్భాల్లో సీఎం, డిప్యూటీ సీఎం పరస్పర విరుద్ధమైన ప్రకటనలు ఇచ్చారని బీజేఎల్పీ నేత గుర్తు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి మూసీకి లక్షా యాభై వేల కోట్లు అని చెప్తే.. భట్టి విక్రమార్క దాన్ని ఖండించారని గుర్తు చేశారు. మూసీ, హైడ్రాల అంశంలో భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డిల వ్యాఖ్యలు ఒకలా ఉంటే.. సీఎం రేవంత్ మాత్రం మరోలా మాట్లాడుతున్నారని విమర్శించారు.

ఆ నలుగురిలో ఎవరో ఒకరు సీఎం..!!

త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి ఊడిపోవడం ఖాయం అని జోస్యం చెప్పారు బీజేఎల్పీ నేత. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలలో ఎవరో ఒకరు ముఖ్యమంత్రి అవుతారని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇక ఎమ్మెల్యేల ఫిరాయింపుల అంశం కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి తలనొప్పిగా మారిందన్నారు. కాంగ్రెస్ నుంచి ఐదుగురు ఎమ్మెల్యేలు కేసీఆర్‌కు టచ్‌లో ఉన్నారని మహేశ్వర్ రెడ్డి చెప్పుకొచ్చారు. జీవన్ రెడ్డి లాంటి సీనియర్ నేతలు సైతం రేవంత్ వైఖరిపై తీవ్ర ఆగ్రహంలో ఉన్నారన్నారు.

Related posts

కమ్యూనిస్టులకు పరాభవం …రగిలిపోతున్న కామ్రేడ్స్…!

Ram Narayana

రేవంత్ రెడ్డి ఆఫర్‌ను తిరస్కరించిన అక్బరుద్దీన్ ఒవైసీ

Ram Narayana

బీఆర్ఎస్ కు మరో షాక్.. దీపా దాస్ మున్షీతో జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి భేటీ!

Ram Narayana

Leave a Comment