Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ వార్తలు

సీఎం మార్పును కొట్టి పారేసిన రెవెన్యూ మంత్రి పొంగులేటి…

సీఎం మార్పును రాష్ట్ర రెవెన్యూ ,గృహనిర్మాణం ,సమాచార పౌరసంబంధాల శాఖామాత్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కొట్టి పారేశారు …ఇది ప్రతిపక్షాలు చేస్తున్న ఊసుబోని కబుర్లేనని 4 సంవత్సరాల ఒక నెల ఖశ్చితంగా రేవంత్ రెడ్డి సీఎం గా ఉంటారని పొంగులేటి ఘంటాపథంగా చెప్పారు …హైద్రాబాద్ లో మీడియాతో చిట్ చాట్ నిర్వహించిన మంత్రి అనేక విషయాలను వారితో పంచుకున్నారు …రాష్ట్రంలో సీఎం మార్పు అంటూ బీజేపీ ఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై పొంగులేటి స్పందించారు .. నలుగురు పేర్లతో వారి పేర్లు అధిష్టానం పరిశీలనలో ఉన్నాయని అందులో తనపేరు ఉండటంతో పొంగులేటి అంలాటిది ఏమి లేదని వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు ..పరిపాలన మంచిగా జరుగుతుంది …మేము ఇచ్చిన హామీ మేరకు అన్నిటిని నెరవేర్చుతున్నాం …అందువల్ల సీఎం మార్పు ఎలా ఉంటుంది అని ప్రశ్నించారు …రెండవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి ఎవరనేది అధిష్టానం నిర్ణయిస్తుందని అన్నారు …ప్రతిపక్షాలు ఎదో ఒకటి మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతున్నాయని వాటిని పట్టించుకోవాల్సిన పనిలేదని అన్నారు …

ఆర్ధికంగా ఎంత ఇబ్బంది ఉన్నా కూడా త‌ల తాక‌ట్టు పెట్ట‌యినా స‌రే ఇందిర‌మ్మ ఇండ్ల‌ను పూర్తిచేస్తాం…ఇందిర‌మ్మ ఇండ్ల నిర్మాణం మా ప్ర‌భుత్వానికి చాలా ప్ర‌తిష్టాత్మ‌కమని మంత్రి అన్నారు …రాష్ట్రంలో ఈనెల 5, 6 తేదీల నుంచి ఇందిర‌మ్మ ఇండ్ల ల‌బ్దిదారుల ఎంపిక‌
15రోజుల్లొ గ్రామ క‌మిటీల ద్వారా ఎంపిక పూర్తి చేసి ఆ వెంట‌నే జాబితాల ఖ‌రారు చేస్తామని తెలిపారు . ఇది నిరంత‌ర ప్ర‌క్రియ‌ గ్రామాల‌లో ఇందిర‌మ్మ క‌మిటీల ఎంపికే ఫైన‌ల్‌
ఇండ్లు మ‌హిళ‌ల పేరిటే మంజూరు. ల‌బ్దిదారులే సొంతంగా ఇండ్లు నిర్మించుకునే అవ‌కాశం క‌ల్పిస్తున్నామని మంత్రి అన్నారు ..ఇందులో ఎటువంటి రాజ‌కీయ జోక్యం ఉండ‌దు. నిరుపేద‌లకు తొలి ప్రాధాన్యత‌ పేద‌రిక‌మే ప్రామాణికంగా ల‌బ్దిదారుల ఎంపిక‌
ల‌బ్దిదారుల ఎంపిక‌లో ప్ర‌త్యేక యాప్ దే కీల‌క‌పాత్ర‌… అందుకే ఇంత స‌మ‌యం ప‌ట్టింది
ఆధార్‌తో స‌హా అన్నివివరాలు యాప్ లో పొందుప‌రుస్తారు..4 రాష్ట్రాలలోని ఇండ్ల నిర్మాణానికి సంబంధించి వివ‌రాలు సేక‌రించి ముందుకు వెళ్తున్నామన్నారు …ఇండ్ల నిర్మాణంలో ఎటువంటి డిజైన్లు ఉండ‌వు, ల‌బ్దిదారుల ఇష్టం మేర‌కు ఇల్లు నిర్మించుకోవ‌చ్చు క‌నీసం 400 చ‌ద‌ర‌పు గ‌జాలు త‌గ్గ‌కుండా ల‌బ్దిదారుడు ఇల్లు నిర్మించుకోవాలన్నారు …

నాలుగు ద‌శల్లో ఇందిర‌మ్మ ఇండ్ల నిర్మాణం … ద‌శ‌ల వారీగా ల‌బ్దిదారుల‌కు చెల్లింపులు… పునాదికి ల‌క్ష‌, గోడ‌ల‌కు లక్షా 25వేలు, శ్లాబ్‌కు ల‌క్ష‌న్న‌ర‌, పూర్త‌యితే ల‌క్ష రూపాయిల చొప్పున చెల్లింపు జరుగుతుందని తెలిపారు ..మొత్తం బ్యాంకు అకౌంట్ ద్వారానే చెల్లింపులు ఉంటాయన్నారు .. కేంద్రం ఇచ్చే నిధుల‌ను తీసుకొని మిగిలిన మొత్తాన్ని రాష్ట్రం భ‌రిస్తుంది
నాలుగు సంవ‌త్స‌రాల‌లో 20 లక్ష‌ల ఇండ్లు నిర్మిస్తామన్నారు ..ప్ర‌తి నియోజ‌క‌వర్గంలో క‌నీసం 3,500 ఇండ్లు నిర్మించేలా చూస్తామని పేర్కొన్నారు ..ఇండ్ల‌లో త‌ప్ప‌నిస‌రిగా వంట‌గ‌ది, బాత్రూం నిర్మించుకోవాలన్నారు ..

ప్ర‌తి మండ‌లంలో కనీసం ఒక‌రు లేదా ఇద్ద‌రు ఎఈ లు ఉండేలా చ‌ర్య‌లు
16 శాఖ‌ల‌కు చెందిన వారిని స‌మీక‌రించి ఇందిర‌మ్మ ఇండ్ల నిర్మాణ బాధ్య‌తలు అప్ప‌గిస్తాం
ఒకే గొడుగు నీడ‌న ఇంజ‌నీర్ల ప‌ర్య‌వేక్ష‌ణ‌లో ఇండ్ల నిర్మాణం జ‌రిగేలా చ‌ర్య‌లు
ప్ర‌భుత్వం త‌ర‌పున 5 ల‌క్ష‌ల సాయం ఇస్తాం, ల‌బ్దిదారులు ఆర్ధిక ప‌రిస్దితి బ‌ట్టి ఇంకా క‌ట్టుకోవ‌చ్చుదేశంలో తెలంగాణ మాత్ర‌మే ఇంత‌టి భారీ గృహ నిర్మాణం చేప‌ట్టి, 5 ల‌క్ష‌ల సాయం అందిస్తోందిగ‌త ప్ర‌భుత్వంలో నిలిచిపోయిన సుమారు 600 -800 ఇండ్ల నిర్మాణానికి కూడా స‌హ‌క‌రిస్తాంతొలి విడత గా సుమారు 28 వేల కోట్ల రూపాయిల వ‌ర‌కు కోట్లు ఖ‌ర్చు కావ‌చ్చునన్నారు …

సుమారు 7,740 కోట్ల రూపాయిల‌ను ఇందిర‌మ్మ ఇండ్లకు బ‌డ్జెట్‌లో కేటాయించాం
అవ‌స‌ర‌మైన నిధుల కోసం కేంద్రాన్ని కోరుతాం, నిధుల‌ను వివిధ మార్గాల‌ద్వారా స‌మీక‌రిస్తామన్నారు …

అర్హులైన విక‌లాంగులకు ప్రాధాన్య‌త ఇస్తే మంచిదే. గ్రామ క‌మిటీలదే తుది ఎంపిక
నంద‌నవ‌నం, మంకాల్ ఇండ్ల స‌మ‌స్య‌కు త్వ‌ర‌లో ప‌రిష్కారం , అధికారుల‌కు ఆదేశాలు
ఇండ్ల స్ధ‌లాలు లేనివారికి 2 వ‌ద‌శ‌లో స్ధ‌లంతో పాటు ఇల్లు నిర్మించి ఇస్తాం. కేంద్ర‌ప్ర‌భుత్వ నిబంధ‌న‌ల ప్ర‌కారం 75 నుంచి 80 గ‌జాల స్ధ‌లాన్ని స‌మ‌కూర్చి ఇస్తాం ఎక్క‌డైనా కొత్త‌గా ఇందిర‌మ్మ కాల‌నీలు ఏర్ప‌డితే క‌రెంట్‌, రోడ్లు , డ్రైనేజ్ త‌దిత‌ర మౌళిక వ‌స‌తుల‌ను ప్ర‌భుత్వమే స‌మ‌కూరుస్తుందన్నారు ..

Related posts

ఐటీ సోదాల్లో రాజకీయాలు …బీజేపీయేతర పక్షాలే టార్గెట్…

Ram Narayana

అమెరికాలో అదానీపై కేసు… స్పందించిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత…

Ram Narayana

ఎమ్మెల్సీ చుట్టూ బిగుస్తున్న ఫోన్ ట్యాపింగ్ ఉచ్చు!

Ram Narayana

Leave a Comment