Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
అంతర్జాతీయం

కెనడా పార్లమెంట్ వెలుపల ‘ఓం’ జెండాను ఎగురవేసిన భారత సంతతి ఎంపీ

  • హిందూ హెరిటేజ్ మాసం నేపథ్యంలో హిందూ జెండా ఎగురవేసిన చంద్ర ఆర్య
  • హిందూ కెనడియన్లు రాజకీయాల్లో భాగస్వామ్యం కావాలని పిలుపు
  • కెనడాలో విద్యావంతులైన, విజయవంతమైన కమ్యూనిటీల్లో మనదీ ఒకటి అన్న ఎంపీ

భారత సంతతికి చెందిన కెనడా ఎంపీ చంద్ర ఆర్య కెనడా పార్లమెంట్ వెలుపల ‘ఓం’ గుర్తు కలిగిన కాషాయ జెండాను ఎగురవేశారు. నవంబర్ నెలలో హిందూ హెరిటేజ్ మాసాన్ని పురస్కరించుకొని ఆయన హిందూ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా అధిక సంఖ్యలో హిందూ కెనడియన్లు రాజకీయాల్లో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. కెనడా రాజకీయ రంగంలో మన ప్రాతినిధ్యం చెప్పుకోదగినంతగా లేదన్నారు.

2022 నుండి హిందూ వారసత్వ మాసంలో చంద్ర ఆర్య హిందూ జెండాను ఎగురవేయడం ఇది మూడోసారి. కెనడాలో హిందూ వారసత్వ మాసాన్ని ప్రతి ఏటా నిర్వహిస్తుంటారు. హిందూ మతానికి సంబంధించిన సాంస్కృతిక, మేథోపరమైన, ఆధ్యాత్మిక వారసత్వం గురించి తెలియజేసే ఉద్దేశంలో భాగంగా దీనిని జరుపుకుంటారు.

జెండా ఎగురవేసిన సందర్భంగా చంద్ర ఆర్య ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు. హిందూ హెరిటేజ్ మాసం ప్రారంభానికి గుర్తుగా పార్లమెంట్ వెలుపల జెండాను ఎగురవేశామని పేర్కొన్నారు. 2022లో దీనిని ఎగురవేసినప్పుడు చెప్పిన విషయాన్నే మరోసారి ప్రస్తావిస్తున్నానని… ఇక్కడ హిందువుల శకం ప్రారంభమైందని తెలిపారు. కెనడాలో విద్యావంతులైన, విజయవంతమైన కమ్యూనిటీల్లో మనది ఒకటి అని పేర్కొన్నారు.

ఇక్కడి సమాజం, ఆర్థిక వ్యవస్థపై సానుకూల ప్రభావం చూపుతున్నామని తెలిపారు. మిగిలిన రంగాల్లో మన ప్రాతినిథ్యం మెరుగ్గా ఉన్నప్పటికీ… రాజకీయంగా మాత్రం ఆశించిన స్థాయిలో లేకుండా పోయామని పేర్కొన్నారు. అందుకే ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగమైన రాజకీయంలో ఇక్కడి హిందువులు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.

Related posts

ఎలాన్ మస్క్‌పై బూతులు…బ్రెజిల్ ఫస్ట్ లేడీ జంజా

Ram Narayana

పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు… భారత్ పై ప్రభావం ఉంటుందన్న ఆర్థికవేత్తలు

Ram Narayana

అధ్యక్ష ఎన్నిక బరినుంచి తప్పుకోండి ప్లీజ్ …లేదు నేనే సరైన అభ్యర్థిని అంటున్న బైడెన్

Ram Narayana

Leave a Comment