Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
అంతర్జాతీయం

ఇరాక్‌కు హెచ్చరికగా అమెరికా కీలక నిర్ణయం.. ఇజ్రాయెల్‌కు మరింత సైనిక సామగ్రి

  • ఇజ్రాయెల్‌కు మరింత సైనిక సామగ్రిని అందిస్తున్నట్లు ప్రకటించిన అమెరికా
  • దీర్ఘశ్రేణి బీ – 52 బాంబర్ ఎయిర్ క్రాప్ట్‌లు, బాలిస్టిక్ క్షిపణులను ధ్వంసం చేసే మిషన్లు..
  • వచ్చే నెలలో కొత్త ఆయుధాలను తరలిస్తున్నట్లు తెలిపిన అమెరికా

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తీవ్ర ఆందోళనలు కలిగిస్తున్న వేళ ఇరాన్‌కు హెచ్చరికగా ఆమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. ఆ దేశం నుండి మరింత సైనిక సామగ్రిని ఇజ్రాయెల్‌కు తరలిస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు పెంటగాన్ అధికారిక ప్రతినిధి మేజర్ జనరల్ పాట్ రైడర్ పేర్కొన్నారు. ఇరాన్, దాని మద్దతుదారులు ఆమెరికన్ పౌరులను, సిబ్బందిని లక్ష్యంగా చేసుకుంటే .. వారిని రక్షించేందుకు  మేము అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటాం అని పాట్ రైడర్ ఓ ప్రకటనలో వెల్లడించారు. వచ్చే నెలలో కొత్త ఆయుధాలను తరలించనున్నట్లు తెలిపారు.  

తాజాగా తరలిస్తున్న సైనిక సామగ్రిలో దీర్ఘశ్రేణి బీ – 52 బాంబర్ ఎయిర్ క్రాఫ్ట్, బాలిస్టిక్ క్షిపణులను విధ్వంసం చేసే మిషన్లు ఉంటాయని ఆమెరికా తెలిపింది. ఇరాన్‌కు హెచ్చరికగా ఈ సామగ్రిని తరలిస్తున్నట్లు చెప్పింది. కాగా, ఇటీవల టెర్మినల్ హై అల్టిట్యూడ్ ఏరియా డిఫెన్స్ బ్యాటరీ (THAAD)తో పాటు సైనిక దళాలను ఇజ్రాయెల్‌కు పంపుతున్నట్లు పెంటగాన్ ప్రకటించిన విషయం విదితమే. ఈ క్రమంలో మరిన్ని ఆయుధాలను తరలించేందుకు సిద్ధమవడం గమనార్హం. 

అక్టోబర్ 1న టెల్‌అవీవ్‌పై దాదాపు 200 క్షిపణులతో ఇరాన్ విరుచుకుపడిన విషయం తెలిసిందే. దీనికి ప్రతీకారంగా ఇరాన్ సైనిక స్థావరాలు, క్షిపణి తయారీ కేంద్రాలపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేసింది.  ఈ దాడుల్లో టెహ్రాన్ ‌కు చెందిన నలుగురు సైనికులు మృతి చెందగా, క్షిపణి తయారీ కేంద్రాలు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. ఈ దాడులను తీవ్రంగా పరిగణిస్తున్నట్లు ఇరాన్ హెచ్చరించింది. ఈ అంశాన్ని తీవ్రతరం చేయవద్దని పలు దేశాలు ఇరాన్‌కు సూచించాయి.  ఈ క్రమంలోనే యూఎస్ మరింత ఆయుధ సంపత్తిని ఇజ్రాయెల్‌కు పంపనునట్లు ప్రకటించడంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత తీవ్రతరం అయ్యే సూచనలు కనబడుతున్నాయి. 

Related posts

భారత్‌కు వస్తున్న కార్గోషిప్‌ను హౌతీ రెబల్స్ ఎలా హైజాక్ చేశారో చూడండి.. వైరల్ వీడియో ఇదిగో!

Ram Narayana

తక్కువ ధరకే ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకోవాలా..? గూగుల్ కొత్త ఫీచర్ ట్రై చేయండి!

Ram Narayana

ఎన్నికల కవరేజీకి అనుమతివ్వలేదన్న విదేశీ జర్నలిస్టు.. స్పందించిన కేంద్రం

Ram Narayana

Leave a Comment