Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

వైసీపీ ప్రభుత్వం పై టీడీపీ ,బీజేపీల సమరం…

వైసీపీ ప్రభుత్వం పై టీడీపీ ,బీజేపీల సమరం
-వారం రోజులపాటు టీడీపీ నిరసనలు
-ఒక్కరోజు ఆందోలనలకు బీజేపీ పిలుపు
-కరోనా నేపథ్యంలో ప్రజలను ఆదుకోవడంలో విఫలమైందని ఆరోపణలు
వైసీపీ ప్రభుత్వం పై సమరానికి టీడీపీ ,బీజేపీ సిద్దపడ్డాయి . టీడీపీ వారం రోజుల నిరసన కార్యక్రమాలకు పిలుపు నివ్వగా , బీజేపీ ఒక్క రోజు ఆందోళనకు పిలుపునిచ్చింది.

ఏపీ వ్యాప్తంగా రేపటి నుంచి ఈ నెల 22 వరకు ‘నిరసన వారం’ నిర్వహించాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది. ఇందులో భాగంగా లాక్‌డౌన్‌తో ఇబ్బందులు పడుతున్న అన్ని వర్గాల ప్రజలను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

కరోనా కారణంగా దెబ్బతిన్న వృత్తి, వ్యాపారాల్లోని వారిని ఆదుకునేందుకు ఇతర రాష్ట్రాలు ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించాయని, కానీ ఏపీ ప్రభుత్వం మాత్రం ఎలాంటి ప్యాకేజీ ప్రకటించలేదని టీడీపీ ఆరోపించింది. కొవిడ్ మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేసింది. అలాగే, వృత్తులు దెబ్బతిన్న వారికి రూ. 10 వేలు అందించాలని, పంట ఉత్పత్తులకు కనీస మద్దతు ధర చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఈ వారం రోజులు నిరసన నేటి నుంచి ప్రారంభించారు.

నిరసన కార్యక్రమాల్లో భాగంగా  తహసీల్దారు కార్యాలయాల్లో, 18న రెవెన్యూ డివిజన్ కార్యాలయాల్లో, 20న కలెక్టర్ కార్యాలయాల్లో పది డిమాండ్లపై వినతి పత్రాలు ఇచ్చి నిరసన తెలుపుతారు. అలాగే, 22న 175 నియోజకవర్గాల్లో దీక్షలు చేస్తారు.

ఏపీ సర్కారుపై రాష్ట్ర బీజేపీ ధ్వజమెత్తింది. ఒక చేత్తో ఉచితాలను ఇస్తూ, మరో చేత్తో నూతన ఆస్తి పన్ను ప్రవేశపెట్టి ప్రజల నడ్డి విరిచే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. వైసీపీ ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ బుధవారం (జూన్ 16) రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలకు పిలుపునిచ్చినట్టు రాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యదర్శి ఎస్.విష్ణువర్ధన్ రెడ్డి వెల్లడించారు. రాష్ట్రంలోని అన్ని కార్పొరేషన్, మున్సిపాలిటీ, నగర పంచాయతీ కార్యాలయాల వద్ద ధర్నాలు చేపట్టాలని పేర్కొన్నారు. కొవిడ్ మార్గదర్శకాలను పాటిస్తూ ధర్నా కార్యక్రమాల్లో పాల్గొనాలని ఏపీ బీజేపీ పిలుపు నిచ్చింది .

 

Related posts

ఏపీ అప్పులపై రఘురామకృష్ణరాజు ప్రశ్న.. వివరాలు వెల్లడించిన నిర్మలా సీతారామన్

Ram Narayana

భర్తతో గొడవపడి ఏకబిగిన 65 కిలోమీటర్లు నడిచిన నిండు గర్భణి.. రెండు రోజులు రాత్రీపగలు నడక!

Drukpadam

175 స్థానాల్లో వైసీపీ గెలిస్తే టీడీపీ కార్యాల‌యానికి తాళం వేస్తాం: అచ్చెన్నాయుడు!

Drukpadam

Leave a Comment