Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
జాతీయ వార్తలు

రాహుల్ గాంధీ భారత పౌరుడు కాదా…? బ్రిటన్ పౌరసత్వం ఉందా …??

ఈ అంశాన్ని పరిశీలిస్తున్నామన్న కేంద్రం

  • భారత పౌరసత్వాన్ని రద్దు చేయాలని బీజేపీ నేత పిటిషన్
  • స్పందన తెలియజేయాలని కేంద్రానికి అలహాబాద్ హైకోర్టు ఆదేశం
  • డిసెంబర్ 19వ తేదీ లోగా నిర్ణయించాలన్న హైకోర్టు

రాహుల్ గాంధీ బ్రిటన్ పౌరుడంటూ ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఆయన పౌరసత్వం అంశాన్ని పరిశీలిస్తున్నామని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ బ్రిటన్ పౌరుడని, కాబట్టి ఆయన భారత పౌరసత్వాన్ని రద్దు చేయాలని పిటిషన్ దాఖలైంది.

బీజేపీ నేత, న్యాయవాది విఘ్నేష్ శిశిర్ అలహాబాద్ హైకోర్టులో ఈ పిటిషన్ వేశారు. ఆయన పౌరసత్వం అంశంపై సీబీఐ విచారణ జరిపించాలని కోరారు. దీనిపై స్పందన తెలియజేయాలని కేంద్రాన్ని అలహాబాద్ హైకోర్టు ఆదేశించింది. డిసెంబర్ 19వ తేదీ లోగా నిర్ణయించాలని ఆదేశించింది. తదుపరి విచారణను వాయిదా వేసింది.

పిటిషనర్ శిశిర్ మాట్లాడుతూ… రాహుల్ గాంధీకి భారత్‌తో పాటు యూకేలో పౌరసత్వం ఉందనేందుకు ఆధారాలు లభించాయన్నారు. ఆధారాలను కోర్టుకు సమర్పించినట్లు తెలిపారు. భారత చట్టాల ప్రకారం ఒక పౌరుడికి భారత్‌తో పాటు మరో దేశంలో పౌరసత్వం ఉండకూడదని గుర్తు చేశారు. అలా ఉంటే ఒక దేశ పౌరసత్వం రద్దవుతుందన్నారు. ఈ క్రమంలో రాహుల్ పౌరసత్వాన్ని భారత ప్రభుత్వం రద్దు చేస్తుందని భావిస్తున్నామన్నారు.

Related posts

పంటపొలాల్లో రూ 2 . 5 లక్షల విలువైన టమాటాలు దొంగతనం…

Drukpadam

ఆదివారమైనా సరే మార్చి 31న ఆ బ్యాంకులన్నీ పనిచేయాలి.. ఆర్బీఐ కీలక ఆదేశాలు

Ram Narayana

రాహుల్ గాంధీ పార్లమెంట్ సభ్యత్వాన్ని పునరుద్ధరించండి … స్పీకర్ కు అధిర్ రంజాన్ చౌదరి విజ్ఞప్తి ..

Ram Narayana

Leave a Comment