- ప్రధాని మోదీని కలవనున్న బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు
- రేపు ఉదయం 11 గంటలకు పార్లమెంట్ ప్రాంగణంలో భేటీ
- ప్రధానితో మోదీ సమావేశం కోసం బయలుదేరిన బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు
తెలంగాణ బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు రేపు ప్రధాని నరేంద్ర మోదీని కలవనున్నారు. వారికి ప్రధాని రేపు ఉదయం 11 గంటలకు అపాయింట్‌మెంట్ ఇచ్చారు. రేపు ఉదయం పార్లమెంట్ ప్రాంగణంలో వారు కలవనున్నారు. ప్రధాని మోదీతో సమావేశం కోసం కమలం పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు ఢిల్లీకి బయలుదేరి వెళుతున్నారు.
తెలంగాణలో తాజా పరిణామాలపై వారు ప్రధానితో చర్చించనున్నారు. ఈ సమావేశంలో కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ కూడా పాల్గొంటారు. ప్రస్తుతం తెలంగాణలో కులగణన జరుగుతోంది. కులగణన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు ఉండనున్నాయి. ఈ భేటీ సందర్భంగా ఈ అంశం కూడా చర్చకు వచ్చే అవకాశముందని అంటున్నారు.