Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఖమ్మం వార్తలు

సిపిఐ ఖమ్మం జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్ హఠాన్మరణం …

సిపిఐ జిల్లా కార్యదర్శి కామ్రేడ్ పోటు ప్రసాద్ (66 )బుధవారం ఉదయం ట్యాంక్ బండ్ వాకింగ్ ట్రాక్ నందు వాకింగ్ చేస్తూ గుండెపోటుతో హఠాన్మరణం చెందారు …సౌమ్యుడు ,ప్రజాఉద్యమనేత , నిబద్ధతగల కమ్యూనిస్ట్ పోటు ప్రసాద్ మరణ వార్త తెలిసి వివిధ రాజకీయ పార్టీలు ప్రజాసంఘాలు , జిల్లాకు చెందిన మంత్రులు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు …రోజులాగే వాకింగ్ కు వెళ్లిన ప్రసాద్ నడుస్తూనే కుప్పకూలి పోయారు .వెంటనే సహచర వాకింగ్ మిత్రులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా అప్పటికి ప్రాణాలు పోయినట్లు డాక్టర్లు తెలిపారు …ఆయన భౌతిక కాయాన్ని మమతా హాస్పిటల్ నుంచి ప్రజల సందర్శనార్థం సిపిఐ జిల్లా కార్యాలయం గిరిప్రసాద్ భవన్ కు తరలించారు …సాయంత్రం 4 గంటల వరకు అక్కడ ఉంచనున్నట్లు సిపిఐ జిల్లా సహాయకార్యదర్శి దండి సురేష్ తెలిపారు .. మూడు సంవత్సరాల క్రితం గుండెకు బైపాస్ సర్జరీ చేయించుకున్నారు ….నిత్యం డాక్టర్లతో చెకప్ చేయించు కుంటున్నారు …కొద్దిరోజుల క్రితమే హైద్రాబాద్ వెళ్లి పరీక్షలు చేయించు కున్నారు … నిన్న కూడా సిపిఐ జిల్లా కార్యాలయంలో సమావేశాల్లో పాల్గొన్నారు …జిల్లా నాయకులతో మాట్లాడు …పొద్దునే ఇలాంటి దుర్వార్త వినడాన్ని పార్టీ నాయకులూ జీర్ణించుకోలేక పోతున్నారు …వారి కుటుంబసభ్యులు విషాదంలో మునిగిపోయారు …

నిబద్ధత కలిగిన నాయకుడు పోటు ప్రసాద్

  • ఆయన అకాల మరణం బాధాకరం
  • దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన మంత్రి పొంగులేటి

ఖమ్మం : రాజకీయాల్లో నిబద్ధత కలిగిన నాయకుల్లో పోటు ప్రసాద్ ఒక్కరని ఆయన అకాల మరణం తనను కలిచి వేసిందని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు. భారత కమ్యూనిస్టు పార్టీలో ప్రస్తుతం ఖమ్మం జిల్లా కార్యదర్శిగా ఉన్న ఆయన ఆ పార్టీ తరుపున అనేక ప్రజా సమస్యల పై పోరాడి విజయం సాధించారని కొనియాడారు. పోటు ప్రసాద్ మరణం సీపీఐ పార్టీతో పాటు ఆయన్ను అభిమానించే అన్ని వర్గాలకు లోటు అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నట్లు ప్రకటించారు. ఆత్మకు శాంతి చేకూరాలని దేవున్ని ప్రార్ధించినట్లు తెలిపారు.

సీపీఐ జిల్లా కార్యదర్శి పువ్వాడ కు చిన్న నాటి మిత్రులు పోటు ప్రసాద్ గారి మృతిపట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన పువ్వాడ అజయ్ కుమార్*

సీపీఐ ఖమ్మం జిల్లా కార్యదర్శి తన చిన్న నాటి మిత్రులు పోటు ప్రసాద్ గారి మృతి తీవ్ర దిగ్భ్రాంతినీ వ్యక్తం చేసిన మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు వారితో చిన్ననాటి నుండి వున్న స్నేహాన్ని గుర్తుచేసుకున్నారు వారి మృతి జిల్లాలోనీ ప్రజా ఉద్యమాలకు తీరనిలోటని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పోటు ప్రసాద్ కు తన కుటుంబంతో ఉన్న అనుబంధాన్ని అజయ్ గుర్తుచేసుకుని వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపి వారు లేరన్న నిజాన్ని ఆ కుటుంబం తట్టుకునే శక్తిని ఇవ్వాలని కోరుకుంటూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్ధిస్తున్నట్లు తెలిపారు.

పోటు ప్రసాద్ మృతికి ఎంపీ వద్దిరాజు సంతాపం

సీపీఐ జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్ హఠాన్మరణం పట్ల రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర దిగ్భ్రాంతి చెందారు. ఆయన మరణం పట్ల తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. పోటు ప్రసాద్ విద్యార్థి దశ నుంచే కమ్యూనిస్టుగా ఉంటూ.. పీడిత, తాడిత వర్గాల ప్రజల అభ్యున్నతికి పాటుపడ్డారని ఎంపీ రవిచంద్ర నివాళులు అర్పించారు. ప్రసాద్ తల్లిదండ్రులు, అన్నదమ్ములు అంతా కమ్యూనిస్టుల ఉంటూ.. ఎర్రజెండా నీడలో నిబద్ధతగా పని చేశారని కొనియాడారు. ప్రసాద్ కుటుంబ సభ్యులకు, సీపీఐ శ్రేణులకు ఎంపీ రవిచంద్ర ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.

Related posts

రైతు సమస్యలే అజెండగా ప్రజల్లోకి : ఎంపీ నామ నాగేశ్వరరావు

Ram Narayana

సత్తుపల్లిలో సండ్రకు ప్రజల బ్రహ్మరథం …రోజురోజుకు పెరుగుతున్న మద్దతు…

Ram Narayana

పాలేరులో కందాల వ్యూహాత్మక ప్రచారం …

Ram Narayana

Leave a Comment