- సామాజిక మాధ్యమాలకు పిల్లల్ని దూరంగా ఉంచే ప్రయత్నం
- 103 ఓట్లతో బిల్లుకు ప్రతినిధుల సభ గ్రీన్ సిగ్నల్
- సెనేట్ ఆమోదం లభించిన వెంటనే చట్టంగా రూపాంతరం
- ఆ వెంటనే సామాజిక మాధ్యమాలకు ప్రభుత్వం ఆదేశాలు
16 ఏళ్ల లోపు పిల్లలు సామాజిక మాధ్యమాల్లో మునిగి తేలకుండా కట్టడి చేసేందుకు ఆస్ట్రేలియా ప్రభుత్వం తీసుకొస్తున్న చట్టానికి సంబంధించిన బిల్లుకు ఆ దేశ ప్రతినిధుల సభ ఆమోద ముద్ర వేసింది. సెనేట్ కూడా దీనికి ఆమోదం తెలిపితే చట్టంగా రూపాంతరం చెందుతుంది. నేడు ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టగా 102 మంది సభ్యులు అనుకూలంగా ఓటేశారు. మెజార్టీ పార్టీలన్నీ బిల్లుకు అనుకూలంగా ఓటెయ్యగా, 13 మంది సభ్యులు మాత్రం వ్యతిరేకించారు.
సెనేట్‌లోనూ బిల్లుకు ఆమోదం లభించిన వెంటనే చట్ట రూపం దాల్చుతుంది. ఆ వెంటనే సామాజిక మాధ్యమాలపై ప్రభుత్వం ఆదేశాలు జారీచేస్తుంది. కొత్త చట్టం అమలు బాధ్యత సామాజిక మాధ్యమాలదేనని, తల్లిదండ్రుల ఫిర్యాదుల ఆధారంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆస్ట్రేలియా ప్రధాని అంటోనీ అల్బనీస్ ఇటీవల పేర్కొన్నారు. కాగా, బిల్లు చట్ట రూపం దాల్చితే సోషల్ మీడియాపై నిషేధం విధించిన తొలి దేశంగా ఆస్ట్రేలియా రికార్డులకెక్కుతుంది.