Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ వార్తలు

పోల్ కమ్మ వాగుకు నిరసన డిసెంబర్ 9న బంద్ మావోయిస్టు పార్టీ పిలుపు!

ద్రోహి ఇచ్చిన సమాచారంతో డిసెంబర్ 1వ తేదీన ములుగు జిల్లా, ఏటూరునాగారం మండలం, చల్పాక గ్రామపంచాయితీ అడవు పోల్ కమ్మ వాగు వద్ద తెలంగాణ గ్రేహౌండ్స్ పోలీసులు ఏడుగురి విప్లవకారులకు విషమిచ్చి అతికిరాతంగా చంపారు. నవంబర్ 30న సాయంత్రం ఏడుగురితో వున్న మా..దళం చల్పాక పంచాయితీలో వున్న వలస ఆదివాసీ గ్రామాన్ని కలిసి నమ్మిన వ్యక్తికి తినడానికి భోజనాలు ఏర్పా చేయమని చెప్పారు. ముందుగానే పోలీసులకు అప్రూవర్ గా మారిన ఇన్ఫార్మర్ ద్వారా భోజనంలో విషం ఇచ్చి స్పృహం కోల్పోయే లాగా చేశారు. స్పృహ కోల్పోయిన కామ్రేడ్స్ ను పట్టుకుని చిత్రహింసలు పెట్టి తెల్లవారుఝామున 4 గంటలకు అతిసమీపం నుండి కాల్చి చంపారు. శతృవు విషపూరిత పథకంలో చిక్కి అమూల్యమైన కామ్రేడ్స్ కురుసం మంగు @ పాపన్న, బద్రు (తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు), ఏగోలపు మల్లు @(మధు, కోటి జెఎండబ్ల్యూపీ డివిజన్ కమిటీ సభ్యుడు), ముచాకీ అందాల్ @ కరుణాకర్ (ఇల్లెందు నర్సంపేట్ ఏరియా కమిటి సభ్యుడి ముచాకీ బూమే (@ జమున (ఏరియా కమిటీ సభ్యురాలు). పూనెం చోటు @కిశోర్( రీజినల్ కంపెనీ-2 మొదటి ప్లటూన్ పార్టీ కమిటి సభ్యుడై కర్ణం కామాల్ (రీజినల్ కంపెనీ-2లోని రెండవ ప్లటూన్ సభ్యుడు), కా. జైసింగ్ (ఏటూర్ నాగారం- మహదేవ్ పూర్ ఏరియా దళం సభ్యుడు. ప్రాణాలర్పించారు. ప్రజల కోసం ప్రాణాలర్పించిన అమరులకు పేరు పేరున తెలంగాణ రాష్ట్ర కమిటీ విప్లవ జోహార్లు అర్పిస్తున్నది.

కాంగ్రెస్ ప్రభుత్వం జరిపిన పాశవిక హత్యకాండను తీవ్రంగా ఖండిస్తూ, డిసెంబర్ 9న తెలంగాణ రాష్ట్ర కమిటీ రాష్ట్రవ్యాప్త బంద్ కు పిలుపునిస్తున్నది. యావత్ పీడత ప్రజలు, ప్రజాస్వామిక వాదులు, విద్యాలయాలు, తదితర వ్యాపార సంస్థలు బందును పాటించి జయప్ర చేయాలని కోరుతున్నది. ఈ ఘటనకు కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ నాయకులు పూర్తి బాధ్యత వహించాలి. ఘటనపై న్యాయ విచారణ జ బాధ్యులైన పోలీసులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కార్పోరేట్లకు అత్యంత విశ్వాసంగా కొమ్ముకాస్తుంది. వారి లాఖ కోసమే దోపిడి విధానాలను అమలు చేస్తున్నది. అందులో భాగంగానే ప్రజా వ్యతిరేక విధానాలకు అడ్డంకిగా మారిన ప్రజా ఉద్యమాల అణిచివేయడానికి ప్రజా పోరాటాలకు నాయకత్వం వహిస్తున్న మావోయిస్టు పార్టీని, పార్టీ నాయకత్వాన్ని లక్ష్యంగా చేసుకుని ఆపరేషన్ కగార్ కొనసాగిస్తున్నారు. దామెరతోగు, రఘునాథపాలెం, పోల్ కమ్మ వాగు వంటి వరుస ఎన్ కౌంటర్ల పేరుతో హత్యలకు పాల్పడుతున్నారు. కాం పార్టీ కొనసాగిస్తున్న ఈ పాశవిక దాడులను ప్రజలు, ప్రజాస్వామిక వాదులు, మేధావులు తీవ్రంగా ఖండించాలని కోరుతున్నాము.

Related posts

మల్లు భట్టివిక్రమార్క వాహనాన్ని తనిఖీ చేసిన పోలీసులు

Ram Narayana

ఐటీ రంగంలో భాగ్యనగరమే టాప్: ఐస్ప్రౌట్ వ్యవస్థాపకులు

Ram Narayana

విషప్రయోగంతో 35కు పైగా కోతులను చంపిన ఆగంతుకులు.. గ్రామస్తుల్లో ఆగ్రహం!

Ram Narayana

Leave a Comment