Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ వార్తలు

హోంగార్డులకు శుభవార్త చెప్పిన తెలంగాణ ప్రభుత్వం!

  • హోంగార్డుల డీఏ పెంచుతూ ఉత్తర్వుల జారీ 
  • రూ.921 నుంచి రూ.1000 వరకూ డీఏ పెంపు
  • వీక్లీ పరేడ్ అలవెన్స్‌ను రూ.100  నుంచి రూ.200లకు పెంపు

తెలంగాణ సర్కార్ రాష్టంలోని హోంగార్డులకు శుభవార్త చెప్పింది. హోంగార్డుల డీఏ (కరవు భత్యం) పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. డీఏను రూ.921 నుంచి వెయ్యి రూపాయల వరకూ పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. అంతే కాకుండా వీక్లీ పరేడ్ అలవెన్స్‌ను రూ.100  నుంచి రూ.200లకు పెంచింది.

అలాగే విధి నిర్వహణలో మృతి చెందిన హోంగార్డుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. వచ్చే ఏడాది జనవరి నుంచి ఇది అమల్లోకి వస్తుందని ఆదేశాల్లో పేర్కొంది. ప్రభుత్వ తాజా ఉత్తర్వులతో హోంగార్డులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.  

Related posts

ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశముంది… నా కోసం ఎవరూ ఆసుపత్రికి రావొద్దు: కేసీఆర్

Ram Narayana

అభివృద్ధి పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తీ చేయాల్సిందే …డిప్యూటీ సీఎం భట్టి

Ram Narayana

దీపావళి కానుకగా వారికి ఇళ్లు ఇవ్వబోతున్నాం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి..

Ram Narayana

Leave a Comment