తెలంగాణ వార్తలు

‘బ‌ల‌గం’ మొగిల‌య్య ఇక‌లేరు…

  • బ‌ల‌గం సినిమాతో గుర్తింపు పొందిన‌ జాన‌ప‌ద క‌ళాకారుడు మొగిల‌య్య
  • కొంత‌కాలంగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న మొగిల‌య్య
  • వరంగ‌ల్‌లోని ఓ ప్రైవేట్ ఆసుప‌త్రిలో చికిత్స పొందుతూ క‌న్నుమూత‌

‘బ‌ల‌గం’ సినిమాతో గుర్తింపు పొందిన‌ జాన‌ప‌ద క‌ళాకారుడు మొగిల‌య్య క‌న్నుమూశారు. కొంత‌కాలంగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న మొగిలియ్య.. వరంగ‌ల్‌లోని ఓ ప్రైవేట్ ఆసుప‌త్రిలో చికిత్స పొందుతూ గురువారం తెల్ల‌వారుజామున‌ తుదిశ్వాస విడిచిన‌ట్లు ఆయ‌న కుటుంబ స‌భ్యులు తెలిపారు. 

కొన్ని రోజులుగా ఆయ‌న‌ గుండె, కిడ్నీ సంబంధిత స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్నారు. దాంతో మొగిల‌య్య చికిత్స కోసం న‌టుడు చిరంజీవి, ‘బ‌ల‌గం’ మూవీ ద‌ర్శ‌కుడు వేణు చేయూత అందించారు. ఇటీవ‌ల ఆయ‌న ఆరోగ్యం మ‌రింత క్షీణించ‌డంతో కుటుంబ స‌భ్యులు వ‌రంగ‌ల్‌లోని సంర‌క్ష ఆసుప‌త్రికి త‌ర‌లించారు. అక్క‌డ చికిత్స పొందుతూ ఈరోజు క‌న్నుమూశారు. కాగా, ‘బ‌ల‌గం’ సినిమాలో క్లైమాక్స్‌లో వ‌చ్చే భావోద్వేగ‌భ‌రిత‌మైన పాట‌ను ఆల‌పించి మొగిల‌య్య ప్రేక్ష‌కుల నీరాజనాలు అందుకున్నారు. గ్రామీణ నేప‌థ్యంలో వ‌చ్చిన ఈ మూవీ ఘ‌న విజ‌యం సాధించ‌డంతో మొగిల‌య్య‌కు మంచి గుర్తింపు వ‌చ్చింది.  

Related posts

రేవతి కుటుంబానికి అల్లు అర్జున్ ఫ్యామిలీ రూ. 25 లక్షలు ఇవ్వలేదు: బక్క జడ్సన్!

Ram Narayana

డిప్యూటీ సీఎం భట్టి నివసిస్తున్న ప్రజా భవన్ కు బాంబు బెదిరింపు …

Ram Narayana

రైతులకు అన్యాయం జరక్కుండా రైల్వే లైన్ నిర్మాణం జరగాలి ..ఖమ్మం ఎంపీ రఘురామిరెడ్డి

Ram Narayana