Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ వార్తలు

మహిళా జర్నలిస్టుల సమస్యల పై కమిషనర్ కు వినతిపత్రం…

మీడియా సంస్థల్లో వృత్తి పరంగా మహిళా జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కారించాలని కోరుతూ సమాచార శాఖ కమిషనర్ ఎస్. హరిష్, ఐఏఎస్ కు తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే) మహిళా సంక్షేమ కమిటీ విజ్ఞప్తి చేసింది…శుక్రవారం నాడు సచివాలయంలో ఆయన ను కలిసిన ప్రతినిధి బృందం, మహిళా జర్నలిస్టుల సమస్యలను ఆయన దృష్టికి తీసుకువెళ్ళారు. మహిళా జర్నలిస్టులకు తమ వాటా ప్రకారం అక్రెడిటేషన్లు ఇచ్చే నిబంధనను కచ్చితంగా అమలు చేయాలని వారు కోరారు. ప్రతి మీడియా సంస్థలో ఇంటర్నల్ కంప్లెంట్స్ కమిటీ ఉండాలనే నిబంధన ఉన్నప్పటికీ అది కూడా అమలు కావడం లేదని వారు విచారం వ్యక్తం చేశారు. విశాఖ గైడ్‌లైన్స్ ప్రకారం ప్రతి మీడియా సంస్థలోనూ జెండర్ సెన్సిటివిటీ వర్క్ షాప్స్ జరగాలనే నిబంధన కూడా కాగితాలకే పరిమితమైందన్నారు. ఇప్పటినుంచైనా విశాఖ గైడ్‌లైన్స్ ప్రతిచోటా అమలు జరిగేలా చర్యలు చేపట్టాలని వారు విజ్ఞప్తి చేశారు. ఐసీసీ గైడ్‌లైన్స్ పాటించని సంస్థలకు అక్రెడిటేషన్లు ఇవ్వరాదనే నిబంధనను తీసుకురావాలని వారు కోరారు. ఐసీసీలో ఇచ్చే ప్రతి కంప్లైంట్ మీడియా అకాడమీ దృష్టికి కూడా తీసుకువచ్చేలా అకాడమీ ఆవరణలో కంప్లైంట్ బాక్స్ ఏర్పాటు చేయాలని వారు కోరారు.

తమ సంస్థలో పని చేస్తున్న మహిళా ఉద్యోగుల జాబితాను ప్రతి మీడియా సంస్థ కచ్చితంగా ఆరు నెలలకోసారి మీడియా అకాడమీకి సమర్పించేలా చర్యలు చేపట్టాలన్నారు. ఇళ్ల స్థలాల కేటాయింపులో మహిళా జర్నలిస్టులకు 33 శాతం రిజర్వేషన్ కచ్చితంగా అమలు చేయాలని, అక్రెడిటేషన్ లతో సంబంధం లేకుండా మహిళా జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు, హెల్త్ కార్డులు మంజూరీ చేయాలన్నారు. ఆయా మీడియా సంస్థలు పూర్తి స్థాయి మాస్టర్ హెల్త్ చెకప్ క్యాంపును ఆరు నెలలకోసారి నిర్వహించేలా చర్యలు చేపట్టాలన్నారు. మీడియా సంస్థల్లో పనిచేసే మహిళ ఉద్యోగులకు రాత్రివేళల్లో తప్పనిసరిగా రవాణా సౌకర్యం కల్పించాలన్నారు. విధి నిర్వహణలో ఎదురయ్యే సవాళ్లు, ఇబ్బందులు, మహిళా జర్నలిస్టుల భద్రత, ఇతర సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని ప్రతినిధి బృందం కోరింది. పైఅంశాలపై ప్రభుత్వంతో చర్చించి, విధివిధానాలను రూపొందించి, మహిళా జర్నలిస్టుల సంక్షేమానికి తగు చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా కమిషనర్ హామి ఇచ్చారు. మహిళా జర్నలిస్టుల సమస్యలపై ఆయన సానుకూలంగా స్పందించారు. ఈ ప్రతినిధి బృందంలో టీయూడబ్ల్యూజే మహిళా సంక్షేమ కమిటీ బాధ్యులు కళ్యాణం రాజేశ్వరీ, యశోద, ప్రతిభ, వాకా మంజుల, యన్ రాజేశ్వరి, తరుణ, సాజిదా బేగంలు ఉన్నారు…

Related posts

సీతారామ ప్రాజెక్ట్ పంప్ హౌసులు సీఎం రేవంత్ రెడ్డి చేతులమీదుగా రేపే ప్రారంభం ..

Ram Narayana

ఇది ప్రజాప్రభుత్వం, అందరం కలిసి పనిచేసి ప్రజలకు మేలు చేద్దాం …మంత్రి పొంగులేటి

Ram Narayana

ఎకరాకు రూ. 100 కోట్లకు పైగా ధర.. ఇంతింతై వటుడింతై అన్నట్టు పరిస్థితి ఉంది: కేసీఆర్

Ram Narayana

Leave a Comment