క్రైమ్ వార్తలుజాతీయ వార్తలు

అన్నా యూనివర్సిటీ క్యాంపస్ లో దారుణం …

అన్నా యూనివర్సిటీ క్యాంపస్ లో దారుణం …

క్యాంపస్​లో దారుణం జరిగింది. ఓ ఇంజినీరింగ్ విద్యార్థినిని ఇద్దరు దుండగులు కలిసి అత్యాచారం చేశారు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదులో ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.
బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం, ‘ డిసెంబర్ 23 రాత్రి బాధితురాలు, ఆమె స్నేహితుడు కలిసి అన్నా యూనివర్సిటీ క్యాంపస్ లో కలిసి మాట్లాడుకుంటున్నారు. ఇంతలో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి, ఆమె స్నేహితుడిని దారుణంగా కొట్టి బయటకు తరిమేశారు. తరువాత వారిద్దరూ కలిసి ఆమెను దారుణంగా అత్యాచారం చేశారు. తరువాత ఆమెకు సంబంధించిన అభ్యంతరకరమైన (నగ్న) ఫొటోలను తమ సెల్ పోన్ తో తీశారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే, ఆ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామని బెదిరించారు. తరువాత ఆమెను అక్కడే వదిలేసి వెళ్లిపోయారు.’ అయినప్పటికీ ఆమె భయపడకుండా మరుసటి రోజు తన స్నేహితుడితో కలిసి పోలీసు స్టేషన్ కు వెళ్లి స్వయంగా ఫిర్యాదు చేశారు.

ఓ..నిందితుడు అరెస్ట్
బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుతో రంగంలోనికి దిగిన పోలీసులు భారతీయ న్యాయ సంహిత, సెక్షన్ 64 ప్రకారం రేప్ కేస్ నమోదు చేశారు. సీసీ టీవీ ఫుటేజ్ సాయంతో ఓ నిందితుని ఇప్పటికే పట్టుకున్నారు. మరో నిందితుడి కోసం 4 స్పెషల్ టాస్క్ ఫోర్స్ బృందాలు ముమ్మరంగా గాలిస్తున్నాయి.

Related posts

ఢిల్లీలో ఆఫ్ఘన్ మంత్రి ప్రెస్ మీట్ లో మహిళా జర్నలిస్టులపై నిషేధం… తీవ్ర విమర్శలు

Ram Narayana

మహారాష్ట్రలో రోడ్డుపై ‘ఐ లవ్ మహమ్మద్’ నినాదం.. పోలీసుల లాఠీచార్జ్.. 30 మంది అరెస్ట్!

Ram Narayana

మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ పై ఐటీ పంజా… రూ.1000 కోట్ల విలువైన ఆస్తుల జప్తు!

Drukpadam