Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ వార్తలు

దిల్ రాజ్ సయోధ్య… సంధ్య థియేటర్ సంఘటనకు ఎండ్ కార్డు పడనున్నదా…

ఫిల్మ్ డవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజ్ మధ్యవర్తిత్వంలో సంధ్య థియేటర్ వద్ద జరిగిన సంఘటనపై సినీ ప్రముఖులతో సమావేశం అయ్యానేదుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంగీకరించారు … ఈ మేరకు షెడ్యూల్ కూడా ఫిక్స్ అయింది. ఈ సమావేశం కోసం కమాండ్ కంట్రోల్ సెంటర్‌లోని రేవంత్ రెడ్డి నివాసంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశం తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు నేతృత్వంలో జరగనుండగా.. సీఎంతో సమావేశానికి.. చిరంజీవి, వెంకటేష్, అల్లు అరవింద్, పలువురు నిర్మాతలు, దర్శకులు రానుండగా.. ప్రభుత్వం నుండి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి, ఉత్తమ్, దామోదర రాజనర్సింహ హాజరు కానున్నట్లు తెలుస్తోంది. సమావేశంలో సంధ్య థియేటర్ సంఘటనతోపాటు సినిమా ఇండ్రస్ట్రీకి ,ప్రభుత్వానికి మధ్య గ్యాప్ పై ప్రధానంగా చర్చించే అవకాశం వుంది…ఈ సమావేశంతో చిత్ర పరిశ్రమలో నెలకొన్న గందరగోళానికి ఎండ్ కార్డు పడుతుందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి…

పుష్ప సినిమా విడుదల రోజున సంధ్య థియేటర్లో సినిమా చూసేందుకు హీరో అల్లు అర్జున్ చిత్ర యూనిట్ సభ్యులు వచ్చారు …ఈ సందర్భంగా హీరో ను చేసేందుకు వచ్చిన అభిమానుల తొక్కిసలాటలో రేవతి అనే మహిళ చనిపోగా , ఆమె కుమారుడు శ్రీతేజ బ్రెయిన్డెడ్ అయ్యి కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు …సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు …అల్లు అర్జున్ థియేటర్ కు వచ్చేందుకు ఎలాంటి పర్మిషలు లేవని అలాంటిది అక్కడకు రావడమే కాకుండా థియేటర్ లోకి వచ్చే ముందు అక్కడ నుంచి వెళ్లే ముందు ఓపెన్ టాప్ వాహనంలో అభిమానులకు అభివాదం చేస్తూ వెళ్లడం వల్ల అక్కడ వేలాది మంది గుమికూడటంతో తొక్కిసలాట జరిగింది .. తొక్కిసలాటలో రేవతి మృతి చెందారు …అల్లు అర్జున్ ను అరెస్ట్ చేశారు …అదే రోజు ఆయనకు ఇంటీరియం బెయిల్ వచ్చింది …పోలీసుల విచారణకు సహకరించాలని కోర్ట్ అల్లు అర్జున్ ను ఆదేశించింది …

అల్లు అర్జున్ కావాలని చేసింది కాకపోయినా …తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందిన విషయం సిమిమా హాల్ లో ఉండి సినిమా చూస్తున్న అల్లు అర్జున్ కు పోలీస్ అధికారి స్వయంగా చెప్పినప్పటికీ ఆయన పట్టించుకోలేదని పోలీసుల ఆరోపణ…ఆ విషయం తనకు తెలియదని రెండవరోజు మాత్రమే తనకు మహిళ చనిపోయిన విషయం తెలిసిందని అల్లు అర్జున్ చెప్పడం పై విమర్శలు ఉన్నాయి…అదే రోజు థియేటర్ దగ్గర జరిగిన రేవతి మరణంపై టీవీ చానళ్ళు అన్ని రిలే చూపించాయి..ఆమె ఎవరు ఎలా చనిపోయిందనే విషయం బయట ప్రపంచానికి తెలిసింది …అల్లు అర్జున్ తనకు రేవతి మరణం విషయం రెండవరోజు వరకు తెలియదని చెప్పడం విడ్డురంగా ఉందనే అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి… చివరకు పోలీసులు అల్లు అర్జున్ తోపాటు పలువురిని సంఘటనపై విచారణ జరిపారు .. అసందర్భంగా కూడా రేవతి మరణం విషయం తనకు తెలియదని ఎందుకు చెప్పారని పోలీసులు అడిగితె మౌనం వహించినట్లు వార్తలు వచ్చాయి..

ఇటీవలనే ఫిలిం డవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా నియమితులైన దిల్ రాజ్ విదేశాల నుంచి వచ్చి రంగంలోకి దిగారు ..ఇటు ముఖ్యమంత్రి తోపాటు ,అటు సినీ పెద్దలను కలిసి జరిగిన సంఘటనపై సయోధ్య కుదిర్చే పనిలో పడ్డారు …హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న శ్రీతేజ ను కలిశారు …రేవతి కుటుంబానికి అల్లు అరవింద్ , చిత్ర యూనిట్ ద్వారా 2 కోట్ల రూపాయలు ఇప్పించే పనిచేశారు …సీఎం తో మాట్లాడి సినీ ప్రముఖులతో సమావేశం ఏర్పాటు చేయించారు …

Related posts

సమస్యలపై కేంద్రాన్ని నిలదీస్తాం…బీఆర్ఎస్ లోక్ సభా పక్ష నేత నామ నాగేశ్వరరావు!

Drukpadam

పార్టీ హైకమాండ్ దృష్టిలో పొంగులేటి…!

Drukpadam

రాష్ట్ర చిహ్నం తుది రూపుపై సీఎం రేవంత్ రెడ్డి స‌మీక్ష‌…

Ram Narayana

Leave a Comment