Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
జాతీయ వార్తలు

రైతుల 9 గంటల బంద్‌తో పంజాబ్‌లో స్తంభించిన జనజీవనం…

  • పంట ఉత్పత్తుల కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని రైతుల డిమాండ్
  • నిన్న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నిరసనలు
  • పంజాబ్-ఢిల్లీ మధ్య 163 రైళ్ల రద్దు
  • స్తంభించిన రవాణా వ్యవస్థ

పంట ఉత్పత్తుల కనీస మద్దతు ధరలకు చట్టబద్ధత కల్పించడంతోపాటు పలు డిమాండ్ల సాధన కోసం పంజాబ్ రైతులు నిన్న రాష్ట్రవ్యాప్తంగా 9 గంటలపాటు నిర్వహించిన బంద్ పలుచోట్ల ఉద్రిక్తతలకు కారణమైంది. రహదారులను మూసివేసి ధర్నాలకు దిగడంతో రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. రైళ్ల రాకపోకలు కూడా నిలిచిపోయాయి. సంయుక్త కిసాన్ మోర్చా, కిసాన్ మజ్దూర్ మోర్చా పిలుపు మేరకు నిన్న ఉదయం 7 గంటలకు ప్రారంభమైన నిరసనలు సాయంత్రం 4 గంటల వరకు కొనసాగాయి. 

రైతుల బంద్ నేపథ్యంలో పంజాబ్-ఢిల్లీ మధ్య మొత్తం 163 రైళ్లను అధికారులు రద్దు చేశారు. పటియాలా-చండీగఢ్ జాతీయ రహదారిపై టోల్ ప్లాజాల వద్ద రైతులు ధర్నా నిర్వహించడంతో ఆ మార్గంలో వాహనాలు పెద్ద సంఖ్యలో నిలిచిపోయాయి. అమృత్‌సర్‌లోని స్వర్ణదేవాలయం గేట్ వద్ద కూడా నిరసనలు కొనసాగాయి. బంద్ విజయవంతమైన నేపథ్యంలో రాష్ట్ర ప్రజలకు రైతు నేత దల్లేవాల్ వీడియో సందేశం ద్వారా అభినందనలు తెలిపారు.

Related posts

17వ లోక్ సభను రద్దు చేస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నోటిఫికేషన్ జారీ…

Ram Narayana

ఢిల్లీ నూతన సీఎం కార్యాల‌యంలో ఇప్పటికీ కేజ్రీవాల్ ముద్ర!

Ram Narayana

173 ఫోన్లు ధ్వంసం చేశారు.. సీఎం కేజ్రీవాల్ పిటిషన్‌పై అఫిడవిట్ దాఖలు చేసిన ఈడీ!

Ram Narayana

Leave a Comment