తెలంగాణ వార్తలు

నిజామాబాద్ కేంద్రంగా పసుపు బోర్డు ..ఎంపీ అరవింద్ కృషి ఫలితం

నిజామాబాద్ కేంద్రంగా పసుపు బోర్డు ..ఎంపీ అరవింద్ కృషి ఫలితం
నిజామాబాద్ వాసులకు నరేంద్రమోదీ సంక్రాంతి కానుక
పసుపు బోర్డు చైర్మన్ గా గంగారెడ్డి నియామకం
ప్రధాని మోడీ ఆదేశాలతో కేంద్ర ప్రకటన

తెలంగాణ ప్రజలకు.. ముఖ్యంగా నిజామాబాద్ వాసులకు ప్రధాని నరేంద్రమోదీ సంక్రాంతి కానుక ఇచ్చారు. నిజామాబాద్ వాసులు ఏళ్ల తరబడి పసుపు బోర్డు కోసం కలలు కంటున్నారు. ఇప్పుడు ఇది సాకారమైంది. నిజామాబాద్‌లో పసుపు బోర్డును ఏర్పాటు చేయాలని మోదీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.

జాతీయ పసుపు బోర్డు చైర్మన్‌గా గంగారెడ్డి నియమితులయ్యారు. మంగళవారం నాడు జాతీయ పసుపు బోర్డు ప్రారంభోత్సవం జరగనుంది. నిజామాబాద్‌లో జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు చేయాలనే డిమాండ్ ఏళ్లుగా వినిపిస్తోంది. 2019 లోక్ సభ ఎన్నికలకు ముందు స్థానిక ఎంపీ ధర్మపురి అర్వింద్ పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చి ఎన్నికల్లో గెలిచారు. ఆయన నిర్విరామ కృషి ఫలితంగానే పసుపు బోర్డు ఏర్పాటుకు కేంద్రం అనుమతి నిచ్చింది … 2019 ఎన్నికల్లో మొదటిసారి నిజామాబాద్ పార్లమెంట్ కు పోటీచేసిన అరవింద్ ఎన్నికల్లో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తానని రైతులకు బాండ్ పేపర్లమీద రాసి మరి హామీ ఇచ్చారు …

Related posts

ఇరాన్ దాడిలో తెలంగాణ వాసికి గాయాలు…

Ram Narayana

కాళేశ్వరం కమిషన్‌ నోటీసుల నేపథ్యంలో .. కేసీఆర్, హరీష్ రావు భేటీ

Ram Narayana

ఎల్ఆర్ఎస్ పేరిట క్రమబద్ధీకరించింది వాళ్లే… మొసలి కన్నీరు కారుస్తోంది వాళ్లే: ఈటల

Ram Narayana