Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
హైద్రాబాద్ వార్తలు

అమెరికా రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్ యువకుడి దుర్మరణం…

  • చికాగోలో జరిగిన రోడ్డు ప్రమాదంలో వాజిద్ మృతి
  • వాజిద్ స్వస్థలం హైదరాబాదులోని ఖైరతాబాద్ ఎంఎస్ మక్తా
  • నాలుగేళ్ల క్రితం ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన యువకుడు

అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్‌కు చెందిన వాజిద్ అనే యువకుడు మృతి చెందాడు. నగరంలోని ఖైరతాబాద్ ఎంఎస్ మక్తాకు చెందిన మహమ్మద్ వాజిద్ ఉన్నత చదువుల కోసం నాలుగేళ్ల క్రితం అమెరికాకు వెళ్లాడు. భారత కాలమానం ప్రకారం బుధవారం ఉదయం చికాగోలో జరిగిన రోడ్డు ప్రమాదంలో వాజిద్ మృతి చెందాడు.

వాజిద్ మృతిపై కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వాజిద్ గతంలో కాంగ్రెస్ పార్టీ ఖైరతాబాద్ డివిజన్ యువజన నాయకుడిగా పని చేశాడు. ఎన్నారై కాంగ్రెస్ మైనార్టీ విభాగంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. సికింద్రాబాద్ ఎంపీ అనిల్ కుమార్, పలువురు నాయకులు అతని కుటుంబాన్ని పరామర్శించారు.

Related posts

తెలంగాణలో పడిపోతున్న ఉష్ణోగ్రతలు.. హైదరాబాద్‌లో సింగిల్ డిజిట్!

Ram Narayana

ఫిలింనగర్ రిలయన్స్ ట్రెండ్స్‌లో భారీ అగ్ని ప్రమాదం!

Ram Narayana

బాలాపూర్ లడ్డూకు రికార్డు ధర 30 లక్షల ఒక వెయ్యి…

Ram Narayana

Leave a Comment