Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
హైద్రాబాద్ వార్తలు

హైద్రాబాద్ మెట్రో రైలు ఇకనుంచి ఉదయం 6 నుంచి రాత్రి 11 గంటల వరకు ..

  • మెట్రో రైలు ప్రయాణ వేళల్లో మార్పులు చేసినట్లు తెలిపిన సంస్థ
  • ఉదయం 6 నుంచి రాత్రి 11 గంటల వరకు రైళ్లు
  • అన్ని టెర్మినళ్లలో అన్ని రోజుల్లో ప్రయాణ సదుపాయం

హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణికులకు ఒక ముఖ్యమైన ప్రకటన వెలువడింది. ఈ నెల 3వ తేదీ నుంచి మెట్రో రైలు ప్రయాణ వేళల్లో మార్పులు చోటు చేసుకున్నాయని హైదరాబాద్ మెట్రో రైలు ఒక ప్రకటన ద్వారా తెలియజేసింది. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు అన్ని టెర్మినళ్లలో, అన్ని రోజుల్లో ప్రయాణ సదుపాయం అందుబాటులో ఉంటుందని సంస్థ స్పష్టం చేసింది. ఈ అవకాశాన్ని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని యాజమాన్యం కోరింది.

హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ అధికంగా ఉండటం వలన ఉద్యోగులు, విద్యార్థులు మరియు నగరవాసులు మెట్రో రైలు ప్రయాణానికి ప్రాధాన్యతనిస్తున్నారు. ఈ నేపథ్యంలో, ప్రయాణికులందరికీ అనుకూలంగా ఉండేలా ఎల్ అండ్ టీ మెట్రో రైలు ప్రయాణ వేళల్లో మార్పులు చేసింది.

Related posts

హైదరాబాదులో లగ్జరీ ఇళ్ల అమ్మకాల పెరుగుదల!

Ram Narayana

హైదరాబాద్ మెట్రో అరుదైన ఘనత.. 50 కోట్ల రైడర్‌షిప్ దాటేసి సరికొత్త రికార్డు…

Ram Narayana

రూ. 3.5 లక్షలతో మెట్రో స్టేషన్‌కు ప్రయాణికుడు.. అనుమతించని సిబ్బంది

Ram Narayana

Leave a Comment