- మహా కుంభమేళాలో విషాద ఘటన
- తొక్కిసలాటలో ప్రాణనష్టం
- ప్రెస్ మీట్ లో వివరాలు తెలిపిన డీఐజీ
ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న మహా కుంభమేళాలో విషాద ఘటన చోటుచేసుకోవడం తెలిసిందే. గత అర్ధరాత్రి తర్వాత జరిగిన తొక్కిసలాటలో పలువురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. మౌని అమావాస్య కావడంతో త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరించేందుకు భక్తులు పోటెత్తారు. బారికేడ్లు విరిగిపోవడంతో ఒక్కసారిగా తొక్కిసలాట జరిగి ప్రాణనష్టం జరిగింది. అయితే, దీనికి సంబంధించి ఇప్పటివరకు మృతుల సంఖ్యపై స్పష్టత లేదు.
ఈ నేపథ్యంలో, మహాకుంభ్ కార్యకలాపాలు పర్యవేక్షిస్తున్న డీఐజీ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. కుంభమేళా తొక్కిసలాట ఘటనలో 30 మంది మృతి చెందారని వెల్లడించారు. 60 మంది గాయపడ్డారని తెలిపారు. మృతుల్లో 25 మందిని గుర్తించామని, మరో ఐదుగురి వివరాలు తెలియాల్సి ఉందని అన్నారు.
అర్ధరాత్రి ఒంటి గంట నుంచి 2 గంటల మధ్య ఈ తొక్కిసలాట జరిగిందని డీఐజీ పేర్కొన్నారు. బారికేడ్ల ధ్వంసం వల్లే తొక్కిసలాట జరిగిందని వివరించారు. ప్రజలు వివరాలు తెలుసుకునేందుకు ‘1920’ హెల్ప్ లైన్ నెంబరును అందుబాటులోకి తీసుకువచ్చామని తెలిపారు. ఇవాళ కుంభమేళాకు వీఐపీలను ఎవరినీ అనుమతించడం లేదని స్పష్టం చేశారు.
తొక్కిసలాటపై జ్యుడిషియల్ కమిటీ, మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా
మహాకుంభ్ తొక్కిసలాటపై న్యాయవిచారణ జరిపించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.
![Mahakumbh Stampede: తొక్కిసలాటపై జ్యుడిషియల్ కమిటీ, మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా](https://i0.wp.com/media.andhrajyothy.com/media/2025/20250127/yogi_ca187ee794_v_jpg.webp?w=1400&ssl=1)
ప్రయాగ్‌రాజ్: మహాకుంభ్ మేళాలో మౌని అమావాస్య పవిత్ర స్నానాల సందర్భంగా తెల్లవారుజాము చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటనపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఈ ఘటనపై న్యాయ విచారణకు ఆదేశించినట్టు తెలిపింది. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. తొక్కిసలాటలో 30 మంది మృతిచెందగా, 36 మంది గాయపడినట్టు యూపీ పోలీసలు అధికారికంగా ప్రకటించారు.
మహాకుంభ్ తొక్కిసలాటపై అధికారిక ప్రకటన.. మృతుల సంఖ్య ఎంతంటే
త్రిసభ్య జ్యుడిషియల్ కమిషన్ : యోగి
మహాకుంభ్ తొక్కిసలాటపై న్యాయవిచారణ జరిపించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. ”ముగ్గురు సభ్యులతో జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేస్తున్నాం. జస్టిస్ హర్ష్ కుమార్ సారథ్యంలో కమిషన్ దర్యాప్తు జరుపుతుంది. మాజీ డీజీ వీకే గుప్తా, రిటైర్డ్ ఐఏఎస్ డీకే సింగ్ సభ్యులుగా ఉంటారు” అని సీఎం తెలిపారు. సీఎం కంట్రోల్ రూమ్, చీఫ్ సెక్రటరీ కంట్రోల్ రూప్, డీజీపీ కంట్రోల్ రూమ్ నుంచి ఎప్పటికప్పుడు పరిస్థితిని మానిటర్ చేస్తున్నామని, తీసుకోవాల్సిన చర్యలపై వరుస సమావేశాలు జరపడంతో పాటు సంబంధిత అధికారులకు అదేశాలు ఇవ్వడం జరిగిందని చెప్పారు. ప్రధాన మంత్రి, హోం మంత్రి, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, రైల్వే మంత్రి, గవర్నర్, ఇతరుల నుంచి అవసరమైన మార్గదర్శకాలు తమకు అందినట్టు యోగి ఆదిత్యనాథ్ వివరించారు.