Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
అంతర్జాతీయంసాంకేతిక వార్త

ఏఐ రంగంలో ప్రకంపనలు సృష్టిస్తున్న చైనా ‘డీప్ సీక్’…

  • ఏఐ రంగంలో చైనా ముందంజ
  • అమెరికా దిగ్గజ టెక్ కంపెనీలకు చైనా స్టార్టప్ సవాల్
  • తన సామర్థ్యంతో అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్న డీప్ సీక్

భవిష్యత్ అంతా ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) మయమే అని టెక్ ప్రపంచం ఘంటాపథంగా చెబుతోంది. ఇప్పటివరకు మనకు తెలిసిన ఏఐ చాట్ బాట్లు…. ఓపెన్ ఏఐ చాట్ జీపీటీ, గూగుల్ జెమినీ, క్లాడ్ ఏఐ. అయితే, చైనాకు చెందిన ఏఐ స్టార్టప్ డీప్ సీక్ తాజాగా ప్రకంపనలు సృష్టిస్తోంది. మనం కోరిన సమాచారాన్ని చిటికెలో, అది కూడా కచ్చితత్వంతో అందిస్తోంది. తన సామర్థ్యంతో చాట్ జీపీటీ, జెమినీలకు పోటీగా మారింది. 

ఏఐ రంగంలో అమెరికా ఆధిపత్యం కొనసాగుతున్న వేళ… ఓ చైనా స్టార్టప్ కంపెనీ సవాల్ విసరడం టెక్ దిగ్గజాలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అమెరికా స్టాక్ మార్కెట్ ను కుదిపేసిన ఈ చైనా స్టార్టప్ అంతర్జాతీయంగా పాగా వేసేందుకు ఉత్సాహంగా అడుగులు వేస్తోంది. 

చైనాలోని హాంగ్ జౌ నగరానికి చెందిన లియాంగ్ వెన్ ఫెంగ్ డీప్ సీక్ ప్రాజెక్టును 2023లో ఏర్పాటు చేశాడు. చైనాకు చెందిన పలువురు టెక్ గ్రాడ్యుయేట్లతో ఓ బృందాన్ని ఏర్పాటు చేసి ఏఐ రంగంలో పరిశోధనలకు తెరలేపాడు. 

ఈ టీమ్ లో 29 ఏళ్ల లువో పు లి ఎంతో కీలకం అని చెప్పాలి. ఆమె ఓ టెక్ రీసెర్చర్. నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ లో ఆమె దిట్ట. ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్ ను తీసుకున్నా, అందులో లాంగ్వేజ్ ప్రాసెసింగ్ ఎంతో కీలకం. లువో పు లి… 2022లో డీప్ సీక్ టీమ్ లో చేరాక, ఆ ఏఐ ప్రాజెక్టు శరవేగంగా పరుగులు పెట్టింది. 

ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే… ఏఐ టెక్ ను అభివృద్ధి  చేయడం ఎంతో ఖర్చుతో కూడుకున్న పని అని అందరూ భావిస్తారు. కానీ, డీప్ సీక్ స్టార్టప్ మాత్రం చాలా తక్కువ వనరులతోనూ అద్భుతమైన ఏఐ టూల్ ను ఆవిష్కరించింది. ప్రస్తుతం డీప్ సీక్ ఏఐ టూల్ రెండు (R1, R2) మోడళ్లలో అందుబాటులో ఉంది. ఇందులో R1 మోడల్ ఉచితం అని తెలుస్తోంది. 

ఆండ్రాయిడ్ ఫోన్ యూజర్లు ప్లే స్టోర్ లోకి వెళ్లి డీప్ సీక్ అని టైప్ చేస్తే డాల్ఫిన్ బొమ్మతో డీప్ సీక్ యాప్ స్క్రీన్ పై ప్రత్యక్షమవుతుంది. డౌన్ లోడ్ చేసుకుని ఉపయోగించడం ప్రారంభించవచ్చు. వెబ్ బ్రౌజర్ లో అయితే జీమెయిల్ అకౌంట్ ద్వారా యాక్సెస్ పొందవచ్చు.

Related posts

భారత సంతతి మహిళ విజ్ఞప్తిపై మస్క్ ఎలా స్పందించారంటే..!

Ram Narayana

స్వలింగ సంపర్క వివాహాలను సుప్రీంకోర్టు గుర్తించకపోవడంపై తొలిసారి స్పందించిన అమెరికా

Ram Narayana

ఒక్క మలుపు కూడా లేకుండా 256 కి.మీ. పొడవైన హైవే!

Ram Narayana

Leave a Comment