పులివెందులకు ఉపఎన్నిక వస్తుందా….?రఘురామ థియరీ ఏమిటి …??
డిప్యూటీ స్పీకర్ ఏమి చెపుతున్నారు …
పులివెందుల ఎమ్మెల్యేగా జగన్ ఉన్నారని వెల్లడి
కానీ ఆయన అసెంబ్లీ సమావేశాలకు రావడంలేదని వివరణ
ఓ ఎమ్మెల్యే అనుమతి లేకుండా 60 రోజులు సభకు గైర్హాజరైతే అనర్హత వేటు పడుతుందని వెల్లడి
జగన్ ఈసారి అసెంబ్లీకి రాకపోతే అనర్హతకు గురవుతాడని వ్యాఖ్యలు
ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నిక రద్దు అవుతుందా …? అంటే అవుతుందని అంటున్నారు ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు …శాసనసభకు ఎన్నికైన ఒక సభ్యుడు అనుమతి లేకుండా 60 రోజులు అసెంబ్లీకి రాకుంటే ఎమ్మెల్యే పదవి కోల్పోతారని వెల్లడించారు … అందువల్ల అక్కడ ఉపఎన్నిక అనివార్యమనే సంకేతాలు ఇస్తున్నారు రఘురామ …డిప్యూటీ స్పీకర్ చూపుతున్నందున చట్టసభకు రాని సభ్యులపై అలంటి చర్య తీసుకున్నారా …ఇంతకూ ముందు దేశంలో ఏ రాష్ట్రంలోనైనా సభ్యులు సభకు హాజరు కాకపోతే చర్యలు తీసుకున్న సందర్భాలు ఉన్నాయా అనేది ఆసక్తిగా మారింది ..
రఘురామకృష్ణరాజు వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి … పులివెందులకు ఉప ఎన్నిక వచ్చే పరిస్థితులు ఉన్నాయని అన్నారు. అది ఎలాగో ఆయన వివరించారు.
ప్రస్తుతం పులివెందుల ఎమ్మెల్యేగా జగన్ ఉన్నారని, ఆయన అసెంబ్లీ సమావేశాలకు రావడంలేదని వెల్లడించారు. ఓ ఎమ్మెల్యే ముందస్తు సెలవు కోరకుండా 60 రోజుల పాటు అసెంబ్లీకి రాకుండా ఉంటే… ఆ ఎమ్మెల్యేపై అనర్హత వేటు పడుతుందని రఘురామ తెలిపారు. ఈసారి గనుక జగన్ అసెంబ్లీకి రాకపోతే పులివెందులకు ఉప ఎన్నిక రావడం తథ్యమని అన్నారు.
అయితే, జగన్ అసెంబ్లీ సమావేశాలకు రావాలని, తన గళం వినిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని రఘురామ స్పష్టం చేశారు. ఇవాళ ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ రఘురామ ఈ వ్యాఖ్యలు చేశారు.