ఎగ్జిట్ పోల్స్ ...రిజల్ట్స్ ...

ఢిల్లీ అసెంబ్లీ బీజేపీదే అంటున్న ఎగ్జిట్ పోల్స్ సర్వేలు …

ఢిల్లీ ఓటర్లు మోడీకి జైకొట్టినట్లు చెప్పిన సర్వేలు…

  • ముగిసిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్
  • బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందంటున్న ఎగ్జిట్ పోల్స్
  • బీజేపీకి 51 నుంచి 60 సీట్లు రావచ్చని పీపుల్స్ పల్స్ అంచనా

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఎన్నికల ఫలితాలు ఎలా ఉండొచ్చనే అంచనాలను ఎగ్జిట్ పోల్స్ వెల్లడిస్తున్నాయి. ఎన్నికల్లో ప్రజలు బీజేపీకే పట్టం కట్టబోతున్నారని మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేస్తున్నాయి. 27 ఏళ్ల తర్వాత ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కాబోతోందని చెపుతున్నాయి. ఏయే సంస్థల ఎగ్జిట్ పోల్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. 

పీపుల్స్ పల్స్ – కొడిమో అంచనాలు:

  • బీజేపీ : 51 – 60
  • ఆప్ : 10 – 19
  • కాంగ్రెస్ : 0

చాణక్య స్ట్రాటజీస్: 

  • బీజేపీ : 39 – 44
  • ఆప్ : 25 – 28
  • కాంగ్రెస్ : 2 – 3

పీపుల్స్ ఇన్ సైట్:

  • బీజేపీ : 40 – 44
  • ఆప్ : 25 – 29
  • కాంగ్రెస్ : 01

రిపబ్లిక్ పీమార్క్:

  • బీజేపీ : 39 – 49
  • ఆప్ : 21 – 31
  • కాంగ్రెస్ : 01

టైమ్స్ నౌ:

  • బీజేపీ : 39 – 45
  • ఆప్ : 29 – 31
  • కాంగ్రెస్ : 0 – 1

ఏబీపీ మ్యాట్రిజ్:

  • బీజేపీ : 35 – 40
  • ఆప్ : 32 – 37
  • కాంగ్రెస్ : 0 – 1

పోల్ డైరీ:

  • బీజేపీ : 42 – 50
  • ఆప్ : 18 – 25
  • కాంగ్రెస్ : 0 – 2

ఢిల్లీ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపై స్పందించిన ఆమ్ ఆద్మీ పార్టీ నేత

Every time exit polls did not show AAP
  • ప్రతిసారీ మా పార్టీ అధికారంలోకి రాదనే ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయని వ్యాఖ్య
  • కేజ్రీవాల్ ఢిల్లీ ప్రజల కోసమే పని చేశారన్న పార్టీ నేత సుశీల్ గుప్తా
  • ఫలితాలు మాకే అనుకూలంగా ఉంటాయి.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ధీమా

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లు బీజేపీ వైపు మొగ్గు చూపినట్లు ఎగ్జిట్ పోల్స్ అంచనా వేస్తున్నాయి. దాదాపు అన్ని సర్వేలు కూడా బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశముందని చెప్పడంపై ఆమ్ ఆద్మీ పార్టీ నేత సుశీల్ గుప్తా స్పందించారు. ఆమ్ ఆద్మీ పార్టీకి ఢిల్లీలో ఇది నాలుగో అసెంబ్లీ ఎన్నికలని, కానీ ప్రతి ఎన్నికల్లోనూ ఎగ్జిట్ పోల్స్ తమ పార్టీ అధికారంలోకి రాదని అంచనా వేశాయని ఆయన అన్నారు.

గతంలో తామే అధికారంలోకి వచ్చామని గుర్తు చేశారు. తమ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ ప్రజల కోసం పని చేశారని ఆయన పేర్కొన్నారు. ఎగ్జిట్ పోల్స్‌ను పక్కన పెడితే, ఫలితాలు ఆమ్ ఆద్మీ పార్టీకి అనుకూలంగానే ఉంటాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఢిల్లీలో మరోసారి ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వమే వస్తుందని ఆయన అన్నారు.

Related posts

అరుణాచల్ లో కమల వికాసం…సిక్కిం లో క్రాంతికారి మోర్చా జయకేతనం …

Ram Narayana

ఎగ్జిట్ పోల్ ఫలితాలపై స్పందించిన సోనియాగాంధీ…!

Ram Narayana

ఏపీ లో జగన్ కు 50 శాతం …ఎన్డీయే కూటమికి 46 శాతం …పార్థదాస్ చాణక్యయ సర్వే

Ram Narayana