- మంత్రుల పనితీరు ఆధారంగా ర్యాంకులు
- చంద్రబాబుకు 6వ స్థానం… పదో స్థానంలో పవన్
- లోకేశ్ కు 8వ ర్యాంకు
- తొలి స్థానంలో ఫరూఖ్… చివరిస్థానంలో వాసంశెట్టి సుభాష్
పనితీరు ఆధారంగా ఏపీ మంత్రులకు ర్యాంకులు ప్రకటించారు. ఫైళ్ల క్రియరెన్స్ ను ప్రధాన ప్రాతిపదికగా తీసుకుని ర్యాంకుల జాబితా రూపొందించారు. ఇందులో ముఖ్యమంత్రి చంద్రబాబుకు 6వ స్థానం లభించింది. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ 10వ స్థానంలో ఉండగా… విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్, హెచ్ఆర్ డీ శాఖల మంత్రి నారా లోకేశ్ 8వ స్థానంలో ఉన్నారు.
ఈ మినిస్టర్స్ ర్యాంకింగ్స్ లో రాష్ట్ర న్యాయ శాఖ, మైనారిటీ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూఖ్ తొలి స్థానంలో నిలిచారు. 2వ స్థానంలో కందుల దుర్గేశ్, 3వ స్థానంలో కొండపల్లి శ్రీనివాస్ ఉన్నారు. నాదెండ్ల మనోహర్ 4, డోలా బాలవీరాంజనేయస్వామి 5, సత్యకుమార్ 7, బీసీ జనార్దన్ రెడ్డి 9, సవిత 11, కొల్లు రవీంద్ర 12, గొట్టిపాటి రవికుమార్ 13, నారాయణ, 14 టీజీ భరత్ 15, ఆనం రామనారాయణరెడ్డి 16, అచ్చెన్నాయుడు 17, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి 18, గుమ్మిడి సంధ్యారాణి 19, వంగలపూడి అనిత 20, అనగాని సత్యప్రసాద్ 21, నిమ్మల రామానాయుడు 22, కొలుసు పార్థసారథి 23, పయ్యావుల కేశవ్ 24వ స్థానంలో నిలిచారు.
ఇక, ఈ జాబితాలో మంత్రి వాసంశెట్టి సుభాష్ చివరిస్థానంలో ఉన్నారు.
మంత్రులు స్లోగా ఉంటే కుదరదు… ఎవరినీ ఉపేక్షించను: సీఎం చంద్రబాబు

- ముగిసిన ఏపీ క్యాబినెట్ సమావేశం
- అనంతరం మంత్రులతో మాట్లాడిన చంద్రబాబు
- తొలి ఆరు నెలలు మంత్రులను పట్టించుకోలేదని వెల్లడి
- మంత్రులు ఇక గేర్లు మార్చాల్సిందేనని స్పష్టీకరణ
ఏపీ క్యాబినెట్ భేటీ అనంతరం సీఎం చంద్రబాబు మంత్రులతో మాట్లాడారు. మంత్రుల పనితీరు మెరుగుపడాలని స్పష్టం చేశారు. అధికారంలోకి వచ్చిన తొలి 6 నెలలు రాష్ట్రాన్ని చక్కదిద్దుకోవడంపైనే దృష్టి కేంద్రీకరించానని, మంత్రుల పనితీరు గురించి పెద్దగా పట్టించుకోలేదని అన్నారు. కానీ ఇకపై మంత్రుల పనితీరుపై ఫోకస్ పెడతానని, ఎవరినీ ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు.
మంత్రులు నిదానంగా ఉంటే కుదరదని, గేర్లు మార్చి ముందుకు వెళ్లాలని అన్నారు. మంత్రుల పనితీరుపై నిరంతర పర్యవేక్షణ ఉంటుందని చంద్రబాబు పేర్కొన్నారు. ఇక, మంత్రులు ఆప్కోస్ ద్వారా కాకుండా… శాఖల వారీగా ఔట్ సోర్సింగ్ సిబ్బందిని తీసుకోవచ్చని సూచించారు.