తెలంగాణ రాజకీయ వార్తలు ..

క్యాబినెట్ విస్తరణ పై రేవంత్ వ్యాఖ్యలు ఆశావహులకు నిరాశ

కులగణన ,ఎస్సీ వర్గీకరణ అనంతరం ఢిల్లీకి వెళ్లిన సీఎం అధిష్టానం పెద్దలను కలిశారు …రాష్ట్రంలో జరిగిన కులగణన ,ఎస్సీ వర్గీకరణ విషయంపై వారికీ వివరించారు …దానిపై అధిష్టానం పెద్దలు సైతం సీఎం ను మెచ్చుకున్నారు …దేశంలో కులగణన చేసి వెల్లడించిన రాష్ట్రంగా తెలంగాణ నిలవడంపై అభినందించారు …ఇప్పుడు దేశవ్యాపితంగా ఇదే డిమాండ్ ను ముందుకు తేవచ్చునని అభిప్రాయపడ్డారు …ఎస్సీ వర్గీకరణ విషయంపై మంచి స్పందన ఉందని అయితే కొందరు దీన్ని రాజకీయ ప్రయోజనాలకోసం వాడుకోవాలని చూడటం దురదృష్టకరమని రేవంత్ బృందం అధిష్టానం పెద్దలకు చెప్పింది …దీనిపై నియోజకవర్గాలవారీగా విస్తృత చర్చ జరగాలని అందుకు ప్రత్యేకంగా కార్యక్రమలు తీసుకోవాలి అభిప్రాయపడ్డారు …

పనిలో పనిగా 13 నెలలుగా ఎదురు చూస్తున్న మంత్రి వర్గ విస్తరణపై కూడా ప్రస్తహించారు …అయితే దానిపై తర్వాత చర్చిద్దామని అధిష్టానం చెప్పడంతో తొందరగా చెప్పాలని రాష్ట్ర నేతలు కోరారు … దానిపై చర్చోప చర్చల అనంతరం స్థానిక సంస్థల , సహకార సంఘాల ఎన్నిలకు ఉన్నందున అయి పూర్తీ అయిన తర్వాత మంత్రి వర్గ విస్తరణ పెట్టుకుంటే బాగుంటుందని అభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం …ప్రభుత్వ పథకాలు బలంగా ప్రజల్లోకి తీసుకోని వెళ్లాలని ప్రతి ఎమ్మెల్యే దీనిపై సీరియస్ గా తీసుకోని పనిచేయాలని అందుకు తగిన కార్యాచరణ రూపొందించాలని నిర్ణయించారు …

మంత్రివర్గంలోకి ఎవరెవరిని తీసుకోవాలనే దానిపై అందిస్తాం ముద్ర వేయాల్సి ఉన్నందున దాన్ని తేల్చడం కొంత ఇబ్బందికరంగా ఉన్నట్లు సమాచారం… ఇప్పటికే షబ్బీర్ అలీ ,వివేక్ వెంకటస్వామి ,అమీర్ అలీ ఖాన్ ,అరికపూడి గాంధీ , ప్రేమ్ సాగర్ రావు , సుదర్శన్ రెడ్డి ,మాల్ రెడ్డి రంగారెడ్డి ,దానం నాగేందర్ , మాదిగ సామాజికవర్గం నుంచి ఒకరు , ముదిరాజ్ సామాజికవర్గం నుంచి ఒకరు పేర్లు పరిశీలిస్తున్నారు …

పీసీసీకి అధ్యక్షని ప్రకటించినప్పటికీ కార్యవర్గం ప్రకటించలేదు …దీనిపై కూడా ఢిల్లీ నేతలతో చర్చించారు …ఎవరెవని తీసుకోవాలి …కులగణన ఆధారంగా ఏ ఏ కులాలకు ప్రాధాన్యత ఇవ్వాలని అంశం చర్చకు వచ్చినట్లు తెలుస్తుంది …దీనిపై రెండు మూడు రోజుల్లో ఒక ప్రకటన వచ్చే అవకాశం ఉందని అంటున్నారు …చూద్దాం ఏమి జరుగుతుందో …!

Related posts

ఉన్న మంత్రిపదవులు ఆరు …15 ఆశావహులు అదృష్టం ఎవరిదో …?

Ram Narayana

ఎవరి బెదిరింపులకు భయపడేది లేదు: మంద కృష్ణ మాదిగ వ్యాఖ్యలపై రేవంత్ రెడ్డి

Ram Narayana

రాజీనామా అడగం… ఎందుకంటే మీరెలాగు పారిపోతారు: హరీశ్‌రావుపై రేవంత్ రెడ్డి

Ram Narayana