కోర్ట్ వార్తలు ...

వల్లభనేని వంశీని పోలీసు కస్టడీకి అనుమతించిన కోర్టు!

  • వంశీని మూడు రోజుల కస్టడీకి అనుమతించిన కోర్టు
  • విజయవాడ పరిధిలోనే విచారించాలని కండిషన్
  • న్యాయవాది సమక్షంలో విచారణకు అనుమతి

టీడీపీ ఆఫీసులో పనిచేసే సత్యవర్ధన్ ను కిడ్నాప్ చేశారనే కేసులో వైసీపీ నేత వల్లభనేని వంశీకి భారీ షాక్ తగిలింది. వంశీని విచారించేందుకు పోలీసుల కస్టడీకి అనుమతిస్తూ విజయవాడలోని ఎస్సీ, ఎస్టీ కోర్టు తీర్పును వెలువరించింది. మూడు రోజుల పాటు వంశీని కస్టడీకి అనుమతించింది. 

అయితే, పోలీసులకు కోర్టు కొన్ని షరతులు విధించింది. విజయవాడ పరిధిలోనే వంశీని విచారించాలని కోర్టు తెలిపింది. న్యాయవాది సమక్షంలో విచారణకు అనుమతించింది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే విచారించాలని తెలిపింది. ఉదయం, సాయంత్రం మెడికల్ టెస్టులు నిర్వహించాలని ఆదేశించింది. మరోవైపు, వెన్ను నొప్పితో బాధపడుతున్న వంశీకి పడుకోవడానికి బెడ్ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.

Related posts

ఆర్మీపై అనుచిత వ్యాఖ్యలు.. రాహుల్ గాంధీకి లక్నో కోర్టు సమన్లు!

Ram Narayana

కోర్టులో బియ్యం చల్లిన డాక్టర్.. చేతబడి అనుమానంతో ఆగిన విచారణ!

Ram Narayana

రచ్చకెక్కిన కుటుంబ వివాదం … కళానిధి మారన్ కు దయానిధి మారన్ లీగల్ నోటీసులు

Ram Narayana