అంతర్జాతీయంప్రమాదాలు ...

సూడాన్ లో కూలిన సైనిక విమానం.. పదిమంది మృతి..!


సూడాన్ లోని ఆర్మీ ఎయిర్ బేస్ లో మంగళవారం రాత్రి విమాన ప్రమాదం చోటుచేసుకుంది. టేకాఫ్ కు ప్రయత్నిస్తూ కుప్పకూలి మంటల్లో చిక్కుకుంది. ఈ ప్రమాదంలో పైలట్ తో పాటు విమానంలోని ప్రయాణికులలో పదిమంది దుర్మరణం పాలయ్యారని సూడాన్ అధికార వర్గాలు తెలిపాయి. అధికారులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. విమానాశ్రయంలోని అగ్నిమాపక సిబ్బంది ఫైరింజన్లతో మంటలను అదుపు చేసి, పలువురు ప్రయాణికులను కాపాడారు.

ఖార్టూమ్ సమీపంలోని వాది సీద్నా ఆర్మీ ఎయిర్ బేస్ లో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదంలో నుంచి గాయాలతో బయటపడ్డ ప్రయాణికులను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. కాగా, ప్రాథమిక దర్యాఫ్తులో విమానం టేకాఫ్ సమయంలో సాంకేతిక సమస్య తలెత్తడం వల్లే ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు.

చికాగో లో తృటిలో తప్పిన విమాన ప్రమాదం …

అమెరికాలోని చికాగో నగరంలో జరిగిన మరో సంఘటనలో రెండు విమానాలు ఒకసారి రన్ వే మీదకు రావడంతో రెండు ఢీకొనాల్సి ఉంది ..అయితే పైలోట్లు అప్రమత్తగంగా ఉండటంతో తృటిలో ప్రమాదం తప్పింది …చికాగో ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లో జరిగిన ఈ ఘటనపై వెంటనే విచారణకు అద్దేశించారు …ఒక వేళ రెండు ఢీకొంటే ఊహించని ప్రమాదం జరిగిఉండేదని సమాచారం …

ఒక ఫ్లైట్ ల్యాండవుతుండగా రన్ వే పైకి మరో విమానం.. తర్వాత ఏం జరిగిందంటే.. వీడియో ఇదిగో!

Pilot Aborts Landing To Avoid Collision With Another Jet On Runway In Chicago
  • విమానం నేలను తాకీతాకగానే మళ్లీ టేకాఫ్ చేసిన పైలట్
  • అమెరికాలోని షికాగో విమానాశ్రయంలో ఘటన
  • సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియో

షికాగో విమానాశ్రయంలో పెను ప్రమాదం తప్పింది. ఒక విమానం ల్యాండవుతున్న సమయంలో రన్వేపైకి మరో విమానం అడ్డంగా రావడంతో అప్రమత్తమైన పైలట్ వెంటనే తన విమానాన్ని తిరిగి టేకాఫ్ చేశాడు. ఈ ఘటన మంగళవారం ఉదయం అమెరికాలోని షికాగో విమానాశ్రయంలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

అసలేం జరిగిందంటే.. ఒమాహా నుంచి బయలుదేరిన సౌత్ వెస్ట్ ఎయిర్ లైన్స్ విమానం మంగళవారం ఉదయం 8:47 గంటలకు షికాగోలోని మిడ్ వే ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లో ల్యాండవుతోంది. విమానాశ్రయంలోని రన్‌వే 31సీపై దిగుతుండగా ఇదే రన్ వేపై ఛాలెంజర్ 350 ప్రైవేట్ జెట్ అడ్డంగా వెళుతోంది. చివరిక్షణంలో ఈ జెట్ ను గమనించిన సౌత్ వెస్ట్ ఎయిర్ లైన్స్ విమానం పైలెట్ మళ్లీ టేకాఫ్ తీసుకున్నాడు. 

దీంతో రెండు విమానాలు ఢీ కొనే ప్రమాదం తప్పింది. రెండో ప్రయత్నంలో సౌత్ వెస్ట్ ఎయిర్ లైన్స్ విమానం క్షేమంగా ల్యాండయింది. ఈ ఘటనపై దర్యాఫ్తు చేపట్టిన ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు.. సదరు ప్రైవేట్ జెట్ పైలట్ ఎలాంటి అనుమతి తీసుకోకుండా రన్ వేపైకి వచ్చాడని ప్రాథమికంగా తేల్చారు. దీనిపై పూర్తిస్థాయిలో దర్యాఫ్తు జరిపి చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.

Related posts

పాక్ పై ఆఫ్ఘానిస్థాన్ దాడి.. సౌదీ అరేబియా సాయం రాలేదేం?

Ram Narayana

కుబేరులు అత్యధికంగా ఉన్న దేశాల జాబితాలో మన దేశం ర్యాంకు ఎంతంటే…!

Ram Narayana

అహ్మదాబాద్ లో ఘోర విమాన ప్రమాదం… మరికొన్నిసంఘటనలు

Ram Narayana