- మధ్యప్రదేశ్ లోని రాజ్‌ఘడ్ జిల్లాలో ఘటన
- ఆదివారం రాత్రి పెళ్లి బృందాన్ని తరలిస్తున్న ట్రాక్టర్ బోల్తా
- మృతుల్లో నలుగురు చిన్నారులు, 25 మందికి గాయాలు
- క్షతగాత్రులకు ఆసుపత్రిలో చికిత్స
మధ్యప్రదేశ్ లో ఓ పెళ్లి బృందం ట్రాక్టర్ బోల్తాపడటంతో 13 మంది మృతిచెందగా మరో 25 మంది గాయపడ్డారు. మృతుల్లో నలుగురు చిన్నారులు కూడా ఉన్నారు. రాజ్‌గర్ జిల్లాలో ఆదివారం రాత్రి ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. గాయపడ్డ వారిలో 13 మందికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నామని రాజ్‌గర్ జిల్లా కలెక్టర్ తెలిపారు. వీరిలో తల, ఛాతిపై గాయాలైన వారిని మెరుగైన చికిత్స కోసం భోపాల్ తరలించామని తెలిపారు. త్రీవ గాయాలైన వారు ప్రస్తుతం కోలుకుంటున్నారని తెలిపారు. రాజస్థాన్ నుంచి పెళ్లి బృందం వచ్చిందని స్థానిక మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
Save or share this story as a newspaper-style Epaper Clip: