అంతర్జాతీయం

ఉక్రెయిన్‌కు ట్రంప్ షాక్.. మిలటరీ సాయం నిలిపివేత!

  • ఇటీవల శ్వేతసౌధంలో జరిగిన సమావేశంలో ట్రంప్, జెలెన్కీ మధ్య మాటల యుద్ధం
  • ఇప్పుడు ఆ దేశానికి అందిస్తున్న మిలటరీ సాయం నిలిపివేస్తూ ట్రంప్ ఆదేశాలు
  • శాంతి విషయంలో ట్రంప్ చాలా స్పష్టంగా ఉన్నారన్న వైట్‌హౌస్
  • ఇప్పటికే ఆయుధాలతో బయలుదేరిన నౌకలు, విమానాల నిలిపివేత

రష్యాతో యుద్ధం చేస్తున్న ఉక్రెయిన్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారీ షాకిచ్చారు. ఆ దేశానికి అందిస్తున్న మిలటరీ సాయాన్ని నిలిపివేస్తూ ఆదేశాలు జారీచేశారు. అమెరికా శ్వేతసౌధంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్‌స్కీతో మాటల యుద్ధం తర్వాత ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

అధ్యక్షుడు (ట్రంప్) శాంతి విషయంలో చాలా స్పష్టంగా ఉన్నారని, తమ భాగస్వాములందరూ ఆ లక్ష్యానికి కట్టుబడి ఉండాల్సిన అవసరం ఉందని వైట్‌హౌస్ అధికారి ఒకరు తెలిపారు. తాము అందిస్తున్న సాయం సమస్య పరిష్కారానికి పనికొస్తుందా? లేదా? అన్నదానిపై సమీక్షిస్తామని, అందుకే సాయాన్ని నిలిపివేసినట్టు పేర్కొన్నారు.

శుక్రవారం వైట్‌హౌస్‌లో రష్యా-ఉక్రెయిన్ అధ్యక్షుల మధ్య జరిగిన సమావేశం వాడీవేడిగా సాగింది. రష్యాతో యుద్ధంలో సాయం చేస్తున్నా ఉక్రెయిన్ తమకు కృతజ్ఞతగా ఉండటం లేదని ట్రంప్ నిందించారు. ఉక్రెయిన్‌కు ఆయుధాలు తీసుకెళుతూ పోలండ్‌లోని ట్రాన్సిట్ ఏరియాలో ఉన్న నౌకలు, విమానాలను అక్కడే నిలిపివేయనున్నట్టు వైట్‌హౌస్ అధికారి తెలిపారు. కాగా, జెలెన్‌స్కీపై ట్రంప్ నిన్న కూడా విరుచుకుపడ్డారు. మరోవైపు, రష్యాతో యుద్ధం ముగింపు అంశం చాలా దూరంలో ఉందని ఉక్రెయిన్ అధ్యక్షుడు తాజాగా వ్యాఖ్యానించడం గమనార్హం.

 రష్యాపై ఆంక్షలు ఎత్తివేసే దిశగా ట్రంప్ అడుగులు

Donald Trump may lift sanctions on Russia

ఉక్రెయిన్ – రష్యా యుద్ధం ఇప్పట్లో ముగిసేలా కనిపించడం లేదు. మరోవైపు రష్యాకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ముందు నుంచి మద్దతుగా ఉంటూ వస్తున్నారు. రష్యాపై ఇప్పుడు ఆయన మరింత ప్రేమను చూపిస్తున్నారు. రష్యాతో సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలని ఆయన భావిస్తున్నారు. ఇందులో భాగంగా రష్యాపై ఆంక్షలను ఎత్తివేసేందుకు ఆయన సిద్ధమయ్యారు. ఈ మేరకు అంతర్జాతీయ మీడియా కథనాలను వెలువరించింది.

రష్యాకు చెందిన కొన్ని సంస్థలు, వ్యక్తులకు ఉపశమనం కల్పించే దిశగా ట్రంప్ ప్రభుత్వం చర్యలు చేపట్టినట్టు సమాచారం. దీనికి సంబంధించిన ముసాయిదా జాబితాను సిద్ధం చేయాలని విదేశీ వ్యవహారాలు, ట్రెజరీ శాఖలను వైట్ హౌస్ కోరినట్టు అంతర్జాతీయ మీడియా తెలిపింది. దీనిపై రష్యన్ ప్రతినిధులతో అమెరికా అధికారులు చర్చలు జరిపేందుకు సన్నాహకాలు చేస్తున్నట్టు సమాచారం.

Related posts

కెనడాలో 20 ఏళ్లలో రెండింతలు పెరిగిన సిక్కులు: భారత్-కెనడా వ్యాపార, విద్యా సంబంధాల లెక్కలివే…!

Ram Narayana

అగ్రరాజ్యంలో గ్రీన్ కార్డ్ కల కల్లలేనా?.. వేలాది మంది భారతీయులపై కొత్త రూల్ ప్రభావం!

Ram Narayana

ట్రంప్‌‌కు వ్యతిరేకంగా అమెరికాలో నో కింగ్స్ పేరుతో పెద్ద ఎత్తున నిరసనలు

Ram Narayana