Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

నాటో నుంచి అమెరికా వైదొలగాలి: ఎలాన్ మస్క్!

  • నాటో భవిష్యత్తుపై మస్క్ కీలక వ్యాఖ్యలు
  • యూరోప్ రక్షణకు అమెరికా నిధులు సమంజసం కాదన్న మస్క్.
  • నాటో నిధులపై గతంలో ఆందోళన వ్యక్తం చేసిన ట్రంప్. 

ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్, ఉత్తర అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ (NATO) నుంచి అమెరికా వైదొలగాలని సూచించారు. ప్రభుత్వ సామర్థ్య విభాగం (DOGE) సహ ఛైర్మన్‌గా ఉన్న మస్క్, అమెరికా నాటో నుంచి తక్షణమే నిష్క్రమించాలనే ఒక సోషల్ మీడియా పోస్ట్‌కు స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. యూరోప్ రక్షణ కోసం అమెరికా నిధులు చెల్లించడం సమంజసం కాదని ఆయన పేర్కొన్నారు.

మార్చి 2న కూడా మస్క్ ఇదే విధమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. నాటో, ఐక్యరాజ్యసమితి నుంచి అమెరికా వైదొలగాలని కోరుతూ సోషల్ మీడియాలో వచ్చిన పోస్ట్‌ తో ఆయన ఏకీభవించారు. 32 సభ్య దేశాలు కలిగిన నాటో తన 76వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న సమయంలో మస్క్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైతం నాటో విషయంలో గతంలో పలుమార్లు వ్యతిరేక వ్యాఖ్యలు చేశారు. జీడీపీలో కొంత శాతం రక్షణ కోసం ఖర్చు చేసే సభ్య దేశాలకు మద్దతు ఇచ్చే విధంగా అమెరికా తన విధానాలను రూపొందించుకోవాలని ఆయన అన్నారు. నిధులు చెల్లించని దేశాలను తాము రక్షించబోమని ట్రంప్ స్పష్టం చేశారు.

కాగా,  2023 చట్టం ప్రకారం, సెనేట్‌లో మూడింట రెండు వంతుల మెజారిటీ లేకుండా అధ్యక్షుడు ఏకపక్షంగా నాటో నుండి వైదొలగడానికి వీలు లేదు.

Related posts

విమాన సిబ్బందిపై ఎమ్మెల్యే రోజా ఫైర్!

Drukpadam

కుప్పం పురపాలక ఎన్నికల్లో అక్రమాలకు తావులేదు : ఎస్ఈసీ నీలం సాహ్నీ!

Drukpadam

వచ్చేవారం తూర్పు తీర ప్రాంతాలకు సైక్లోన్ మోచా ముప్పు!

Drukpadam

Leave a Comment