Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

నీటి ప్రాజక్టుల విషయంలో భట్టి నిజాలు తెలుసుకొని మాట్లాడాలి :మంత్రి పువ్వాడ…

నీటి ప్రాజక్టుల విషయంలో భట్టి నిజాలు తెలుసుకొని మాట్లాడాలి :మంత్రి పువ్వాడ
-తెలంగాణకు అన్యాయం జరిగితే తడాఖా చూపిస్తాం
-ట్రైబ్యునల్ తీర్పులను కూడా ఏపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు
-పోతిరెడ్డిపాడు ప్రాజెక్టును అక్రమంగా నిర్మిస్తున్నారు
-తెలంగాణకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోం
-రెండు రాష్ట్రాల వాటాలను కేంద్రం తేల్చాలి
-ఆంధ్రప్రదేశ్ ఆవతారనే పెద్ద కుట్ర అంటున్న మంత్రి నిరంజన్ రెడ్డి

తెలంగాణ, ఏపీ రాష్ట్రాల మధ్య జల వివాదం ముదురుతోంది. తాజాగా, ఏపీ ప్రభుత్వ తీరును తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ తప్పుబట్టారు. ఆ రాష్ట్రం నిర్మిస్తున్న పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు అక్రమమేనని ఆయన అన్నారు. పనులు ఆపుతామని చెప్పిన ఏపీ ప్రభుత్వం మాట తప్పిందని విమర్శించారు. ఏపీ ప్రభుత్వ తీరుపై మంత్రి ప్రశాంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల్లో తప్పేముందని ప్రశ్నించారు.

నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ తీర్పులను ఏపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. తెలంగాణకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. నదీ జలాల విషయంలో కేంద్రం కల్పించుకుని… ఇరు రాష్ట్రాల వాటాలను తేల్చాలని డిమాండ్ చేశారు. తెలంగాణకు దక్కాల్సిన నీటి విషయంలో తగ్గే ప్రసక్తే లేదని అన్నారు. టీకాంగ్రెస్ నేత మల్లు భట్టి విక్రమార్క నిజాలు తెలుసుకుని మాట్లాడాలని సూచించారు.

ఆంధ్రప్రదేశ్ అవతరణే పెద్ద కుట్ర: తెలంగాణ రాష్ట్ర మంత్రి నిరంజన్‌ రెడ్డి
ఏపీ ఏర్పాటు తర్వాత తెలంగాణ ప్రాజెక్టులను పట్టించుకోలేదు
ఏపీ అక్రమ ప్రాజెక్టును అడ్డుకుంటాం
ఏపీ ప్రాజెక్టులకు కేంద్రం అనుమతి కావాలి

ఏపీ ప్రభుత్వం చేపడుతున్న రాయలసీమ ఎత్తిపోతల పథకం అక్రమమని తెలంగాణ మంత్రి నిరంజన్ రెడ్డి విమర్శించారు. ఈ అక్రమ ప్రాజెక్టును అడ్డుకుని తీరుతామని అన్నారు. ఆంధ్రప్రదేశ్ అవతరణే పెద్ద కుట్ర అని… తెలంగాణ నీటిని దోచుకునేందుకే ఆంధ్రప్రదేశ్ ని ఏర్పాటు చేశారని విమర్శించారు.

ఏపీ ఏర్పాటు తర్వాత తెలంగాణ ప్రాజెక్టులను పట్టించుకోలేదని… ఏపీ అవతరణతో మహబూబ్ నగర్ జిల్లాలకు తీరని అన్యాయం జరిగిందని ఆరోపించారు. ఏపీ ప్రాజెక్టులు అక్రమమని, తెలంగాణ నిర్మిస్తున్నవి సక్రమ ప్రాజెక్టులని అన్నారు. ఆనాడు జలదోపిడీకి సహకరించినవాళ్లు ఇప్పుడు సీఎం కేసీఆర్ పై విమర్శలు గుప్పిస్తున్నారని మండిపడ్డారు.

విభజన చట్టం ప్రకారం ఏపీ ప్రభుత్వం కొత్త ప్రాజెక్టును మొదలుపెట్టాలంటే కేంద్రం అనుమతిని తీసుకోవాలని నిరంజన్ రెడ్డి చెప్పారు. కేంద్రం ద్వారా నీటి కేటాయింపులను జరిపించుకోవాలని అన్నారు. ముందు చూపుతో జోగులాంబ బ్యారేజ్ ను కేసీఆర్ ప్రతిపాదించారని చెప్పారు. కరోనా కష్టకాలంలో కూడా రైతులకు రైతుబంధు నిధులు అందించిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదని అన్నారు. రైతుబంధు కింద రూ. 7,360 కోట్లను రైతుల ఖాతాల్లో జమచేశామని చెప్పారు.

 

Related posts

ఎమ్మెల్యే వంశీపై సీనియర్ నేత దుట్టా ఫైర్!

Drukpadam

కేటీఆర్ లీగల్ నోటీసులపై స్పందించిన బండి సంజయ్!

Drukpadam

వీధి రౌడీలా మాట్లాడటం ఎంత వరకు న్యాయం? పవన్ కల్యాణ్ కు ముద్రగడ ఘాటు లేఖ

Drukpadam

Leave a Comment